దేశంలో కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరుల నుంచి ఎలక్ట్రిక్, గ్యాస్ ఆధారిత ఫ్యూయల్ వైపు మారేందుకు ఇదొక కారణం. అయితే పొల్యూషన్ నిబంధనలు పాటించని వివిధ ఎంటిటీలపై కాలుష్య నియంత్రణ మండలి(CPCB) చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL)లకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాక్ ఇచ్చింది. తమ పెట్రోల్ బంకుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు భారీగా జరిమానా విధించింది. ఈ మేరకు IOCకి 1 కోటి మరియు BPCLకి 2 కోట్లు ఫైన్ విధించినట్లు రెండు సంస్థలూ తమ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లలో తెలిపాయి.

"సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లోని రిటైల్ అవుట్‌లెట్లలో వేపర్ రికవరీ సిస్టమ్స్ (VRC) ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంది. ఇందులో విఫలం కావడంతో CPCB జరిమానా విధించింది. 1 కోటి మేర చెల్లించాలని ఆదేశించిన నోటీసులు మాకు అందాయి' అని IOC ఓ ప్రకటనలో తెలిపింది. BPCL కూడా దాదాపు ఇదే విధంగా స్పందించింది.
బంకుల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరిగా మారి వాతావరణంలోకి విడుదలవుతుంది. అందులో బెంజీన్, టోలున్, జిలీన్ వంటి క్యాన్సర్ కారకాలు ఉంటాయి. దీనిని కట్టడి చేసేందుకు రిటైల్ అవుట్లెట్లలో VRSని అమర్చాలని 2016లోనే ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీచేయబడ్డాయి. వాటిని పాటించడంలో IOC, BPCL విఫలం కావడంతో PCB కన్నెర్ర జేసింది.


Click it and Unblock the Notifications