donations: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు పెడుతుంటాయి. అంత డబ్బు వాటికి ఎక్కడిది అంటే విరాళాల రూపంలో ఫండ్స్ వచ్చాయని చెబుతుంటాయి. కానీ వాటిని ఎవరు పంపించారు అనే విషయం మాత్రం ఎప్పటికీ ఒక సీక్రెట్టే. నల్లధనం తరహా అక్రమ సంపాదన వ్యవస్థలోకి చొరబడటం పెరిగిపోతోందని.. ఆర్థిక, సామాజిక వేత్తల నుంచి ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. అయితే తాజాగా విడుదలైన ఓ నివేదిక.. పరిస్థితి తీవ్రతను మరింత పెంచడం చర్చనీయాంశం అయింది.

65 శాతం గుర్తు తెలియనివే
రాజకీయ పార్టీలకు వచ్చిన నిధుల విషయమై ఎన్నికల పర్యవేక్షణ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ADR) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. 2021-22 లో జాతీయ పార్టీలకు మొత్తంగా రూ.2,172.23 కోట్లు విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. మొత్తం రూ.3,289.34 కోట్ల విరాళాల్లో 65 శాతం గుర్తు తెలియని సోర్సెస్ ద్వారా జమ అయినట్లు ప్రకటించింది. అందులోనూ ఎలక్షన్ బాండ్స్ ద్వారా రూ.1,811.94 లేదా 83.414 శాతం జమైనట్లు తెలిపింది. 8 పార్టీల మొత్తం డొనేషన్లలో సగం కంటే ఎక్కువగా ఈ మార్గాల ద్వారానే వచ్చినట్లు స్పష్టం చేసింది.

ఎన్నికల కమిషన్ నివేదికల ఆధారంగానే..
రూ.20 వేల కంటే ఎక్కువగా విరాళం ఇచ్చిన వారి పేర్లను ఎన్నికల కమిషన్(EC)కు రాజకీయ పార్టీలు నివేదిస్తుంటాయి. వీరిని తెలిసిన సోర్సెస్ గా పరిగణిస్తారు. మెంబర్షిప్ ఫీజులు, పార్టీ ఆస్తుల అమ్మకం, బ్యాంకు డిపాడిట్లపై వడ్డీలు, పుస్తకాలు తరహా పబ్లికేషన్ల అమ్మకాలు, పాత వార్తా పేపర్ల అమ్మకం ద్వారా సమకూరిన నిధులను.. ఆయా పార్టీలు నిర్వహిస్తున్న అకౌంట్ పుస్తకాల్లో నోట్ చేస్తాయి. ఆయా జాతీయ పార్టీలు ECకి ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ పరిశోధన నిర్వహించినట్లు ADR తెలిపింది.

నివేదికలోని పార్టీలివీ..
ఈ నివేదికలో భారతీయ జనతా పార్టీ(BJP) సహా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(INC), ఆలిండియా తృణమూలు కాంగ్రెస్(AITC), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(CPIM), నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP), బహుజన సమాజ్ పార్టీ(BSP), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(CPI), నేషనల్ పీపుల్స్ పార్టీలను ADR పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

సింహభాగం భాజపాదే
2021-22లో రూ.1,161 కోట్లు గుర్తుతెలియని మార్గాల ద్వారా విరాళాలు వచ్చినట్లు భారతీయ జనతా పార్టీ ECకి నివేదించింది. ఈ విధంగా జమైన నిధుల పరంగా చూస్తే.. అన్ని జాతీయ పార్టీల్లోనూ భాజపాదే అగ్రస్థానం కావడం విశేషం. మొత్తం ఈ తరహా నిధులు రూ.2,172.23 కోట్లలో కమలం పార్టీనే 53.45 శాతం సమీకరించింది. మిగిలిన పార్టీల సగటుతో పోల్చినా BJP భాగం దాదాపు రూ.160 కోట్లు ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. గుర్తుతెలియని మార్గాలద్వారా విరాళాలు రూ.389 కోట్లుగా ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రకటించింది.

ఏడేళ్ల నుంచీ కోర్టు పరిశీలనలోనే..
ఎలక్షన్ బాండ్లను నిర్వహించే ఏకైక సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావడం విశేషం. ఏటా 4 సార్లు వీటిని SBI రిలీజ్ చేస్తూ ఉంటుంది. అయితే అందులో పాల్గొనే వారి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచబడతాయి. ఈ మేరకు చట్టం అనుమతిస్తోంది. ఈ బాండ్ల ద్వారా పార్టీలకు వస్తున్న విరాళాల విషయంలో పారదర్శకత లేనందున.. ఈ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ ADR సహా పలు సంస్థలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అయితే 2015 నుంచి ఇప్పటివరకు ఆయా పిటిషన్లు కోర్టు పరిశీలనలోనే మగ్గుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications