Cyber Scam: సైబర్ స్కామ్స్ ప్రస్తుతం సామాన్యులను సైతం తాకుతూ ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. టచ్ మెుబైల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మోసగాళ్లకు ప్రజల డబ్బు కొల్లగొట్టడం చాలా సులభతరంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం మోసగాళ్లు ఏకంగా పోలీసులను సైతం టార్గెట్ చేస్తుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఆన్‌లైన్ మోసగాళ్లు ప్రస్తుతం ప్రజల నుంచి డబ్బును దోపిడీ చేయడానికి హానికరమైన లింక్‌లను ఉపయోగించడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇలాంటి మోసాలపై మీడియా, సైబర్ నిపుణులు ఎంత అవగాహన కల్పించినప్పటికీ చాలా మంది ఇప్పటికీ ఆర్థికంగా భారీ నష్టాలను చూస్తున్నారు. తాజాగా పుణైకి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ సైబర్ మోసానికి గురై ఏకంగా రూ.2.3 లక్షలు కోల్పోయారు. వాస్తవానికి పూణే సమీపంలోని శాశ్వత్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ ఒక బేకరీలో కేక్ కొని డబ్బు చెల్లించటానికి ప్రయత్నించినప్పుడు మోసం జరిగింది.

లావాదేవీని పూర్తి చేయడానికి కానిస్టేబుల్ QRని స్కాన్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత తన సేవింగ్స్ ఖాతా నుంచి రూ.18,755 డెబిట్ అయినట్లు గమనించారు. అనధికార లావాదేవీతో అప్రమత్తమైన వ్యక్తి తన ఇతర బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయగా శాలరీ అకౌంట్లో రూ.12,250 డెబిట్ చేసినట్లు గుర్తించారు. ఖాతాలో ఉన్న డబ్బు మెుత్తం మాయం కావటంతో ఒక్కసారిగా పోలీసు కానిస్టేబుల్ ఆందోళనకు గురయ్యాడు. దీని తర్వాత కానిస్టేబుల్ గోల్డ్ లోన్ ఖాతాలో రూ.1.9 లక్షలకు "వన్ టైమ్ పాస్‌వర్డ్" కూడా అందుకున్నాడు. అయితే ఓటీపీ వివరాలను ఎవరితోనూ పంచుకోకపోయినప్పటికీ లావాదేవీ విజయవంతం కావటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ మెుత్తం సదరు బాధిత పోలీసు అకౌంట్ నుంచి విత్ డ్రా చేయబడ్డాయని గమనించాడు.
అయితే మోసగాళ్లు సదరు పోలీసుకు సంబంధించిన ఇతర క్రెడిట్ కార్డుల నుంచి కూడా డబ్బును తస్కరించేందుకు ప్రయత్నించినట్లు తేలింది. రెండు లావాదేవీల ద్వారా రూ.14,000 ఖర్చు చేసేందుకు మోసగాళ్లు ప్రయత్నించినట్లు గుర్తించబడింది. ఈ క్రమంలో వరుస దాడులతో వెంటనే అప్రమత్తమైన సదరు కానిస్టేబుల్ వెంటనే తన బ్యాంక్ ఖాతాలను, క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయటంతో నష్టం కొంత తగ్గింది. అయితే తనకు తెలియకుండానే, తనకు ఎలాంటి ప్రమేయం లేకుండానే మోసగాళ్లు డబ్బు తస్కరించటంపై సదరు పోలీసు అధికారి వెంటనే ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. మోసగాళ్లు కానిస్టేబుల్ మొబైల్ ఫోన్, బ్యాంక్ ఖాతాలను హానికరమైన APK ఫైల్ ద్వారా యాక్సెస్ చేయడంతో బాధితుడు కూడా డబ్బును కోల్పోయాడని పోలీసులు తెలిపారు. మోసగాళ్లు పంపిన దురుద్దేశపూర్వక లింక్‌ను కానిస్టేబుల్‌కు తెలియకుండానే క్లిక్ చేసి ఉండవచ్చని వారు చెబుతున్నారు. అయితే దీనికి కారణం ఏపీకే ఫైలా లేక క్యూఆర్ కోడ్ ద్వారా మోసానికి పాల్పడ్డారా అనే వివిధ కోణాల్లో సైబర్ పోలీసులు ప్రస్తుతం దీనిని దర్యాప్తు చేస్తున్నారు. డిజిటలైజేషన్ కారణంగా ప్రజలు యూపీఐ చెల్లింపులను విస్తృతంగా వినియోగిస్తున్న వేళ మోసాలు పెరిగిపోవటంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications