ముంబై: వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తొలి కేసు నమోదైన ఇన్ని సంవత్సరాల తరువాత కూడా దీని దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే వస్తోంది. కొత్త అంశాలు బహిర్గతమౌతూనే ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోవడం, ఆంటిగ్వా అండ్ బార్బుడాలో ఆ దేశ పౌరసత్వ హోదాలో నివసిస్తోండటం.. వంటి పలు కారణాల వల్ల ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రావట్లేదు.

ప్రీతిచోక్సీ పేరు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఇప్పుడు తాజాగా మేహుల్ చోక్సీ భార్య ప్రీతి చోక్సీ పేరు బయటికి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఆమె పేరును దర్యాప్తు జాబితాలో చేర్చింది.. ఛార్జ్‌షీట్‌ను నమోదు చేసింది. పీఎన్‌బీ స్కాం కేసులో ప్రీతి చోక్సీని ప్రధాన లబ్దిదారుగా పేర్కొంది. కొన్ని ఆఫ్‌షోర్ కంపెనీల నుంచి నేరుగా ఆమె లబ్దిపొందినట్లు ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది.

పీఎంఎల్ఏ కేసు..
ప్రీతి చోక్సీపై ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు. మేహుల్ చోక్సీ, గీతాంజలి జెమ్స్, గిలి ఇండియా, నక్షత్ర బ్రాండ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ ఉద్యోగి గోకుల్‌నాథ్ షెట్టిల పేర్లను తాజా ఛార్జ్‌షీట్‌లోనూ కొనసాగించింది. 13,000 కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఇది మూడో ఛార్జ్‌షీట్. ఇదివరకు 2018 జూన్, 2020 ఏప్రిల్‌లో ఛార్జ్‌షీట్లు నమోదయ్యాయి.

అంటిగ్వాలో..
కాగా ప్రీతి చోక్సీ.. తన భర్త మేహుల్ చోక్సీతో కలిసి ప్రస్తుతం కరేబియన్ ద్వీపదేశం అంటిగ్వా అండ్ బార్బుడాలో నివసిస్తోన్నారు. 2017లో వారికి ఆ దేశ పౌరసత్వం లభించింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉండటం వల్ల మేహుల్ చోక్సీని భారత్‌కు తీసుకుని రావడానికి ఈడీ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా ఈ కేసులో జోక్యం చేసుకున్నప్పటికీ దర్యాప్తు వేగం పుంజుకోవట్లేదు.

కిడ్నాప్ డ్రామా..
గత ఏడాది మేహుల్ చోక్సీ.. అనుమానాస్పద స్థితిలో అదృశ్యం అయిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆయన కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంటిగ్వా పశ్చిమ తీర ప్రాంతంలోని రిసార్ట్ విలేజ్, ప్రఖ్యాత పర్యాటక కేంద్రం జాలీ హార్బర్ సమీపంలో ఆయన కారు మాత్రమే అప్పట్లో లభించింది. ఆ మరుసటి రోజు ఆయన పొరుగు దేశం డొమినికాలో కనిపించారు. గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను కిడ్నాప్ చేశారంటూ అప్పట్లో ప్రీతిచోక్సీ అక్కడి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

స్వదేశానికి తీసుకుని రావడానికి..
అక్రమంగా తమదేశంలో ప్రవేశించినందుకు మేహుల్ చోక్సీని డొమినికా ప్రభుత్వం జైలుశిక్ష విధించింది. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. డొమినికా నుంచి నేరుగా భారత్‌కు తీసుకుని రావడానికి అప్పట్లో సీబీఐ, ఈడీ అధికారులు అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చలేదు. అంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వం ఉన్నందున నేరుగా భారత్‌కు అప్పగించడానికి చట్టాలు అంగీకరించలేదంటూ వార్తలు అప్పట్లో వినిపించాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications