మీరు కూడా నెలకు కనీస బ్యాలెన్స్ ఉండకపోతే బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది అని భయపడే వారిలో మీరు ఒకరా? అయితే మీకు మంచి వార్త! పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఇకపై కనీస బ్యాలెన్స్ లేకపోయినప్పటికీ పెనాల్టీ చార్జీలు విధించదని ప్రకటించింది. దీని ద్వారా లక్షలాది ఖాతాదారులకు ఆర్థిక ఊరట కలుగనుంది. ముఖ్యంగా చిన్న ఆదాయ గలవారికి, రైతులకు, మహిళలకు ఇది ఓ మంచి అభివృద్ధి అని బ్యాంక్ తెలిపింది. జూలై 1, 2025 నుంచి ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. అంటే ఇకపై ఖాతాలో ఎంత ఉన్నా మీ మీద చార్జీలు పడవు. ఇది ఖాతాదారులకు ఒక నిజమైన రిలీఫ్ అనే చెప్పవచ్చు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన సేవింగ్స్ ఖాతాదారుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 2025 జూలై 1వ తేదీ నుంచి, కనీస నిల్వ (Minimum Average Balance) ఉంచకపోతే విధించే పెనాల్టీ ఛార్జీలను పూర్తిగా రద్దు చేసింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ సేవలను అందరికీ చేరవేయడం, అలాగే వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
కనీస నిల్వ ఛార్జీలు అంటే ఏమిటి?
కనీస నిల్వ ఛార్జీలు(MAB) అనేది ఖాతాదారులు నెల లేదా త్రైమాసిక సమయాన తమ ఖాతాలో కలిగి ఉండాల్సిన కనీస సగటు నిల్వ. ఇది బ్యాంకుల వ్యయాలను సమర్థంగా నిర్వహించేందుకు విధించేది. కనీస నిల్వ ఛార్జీలు ఉంచలేకపోతే గతంలో బ్యాంకులు రూ. 100 నుంచి రూ. 600 వరకు పెనాల్టీ వసూలు చేస్తున్నాయి.
PNBలో ఇప్పటివరకు ఉండే చార్జీలు ఎలా ఉండేవి?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ఇప్పటివరకు సేవింగ్స్ ఖాతాదారులపై విధించిన కనీస సగటు నిల్వ (MAB) చార్జీలు ఖాతా విధానాన్ని బట్టి వేరేవేరుగా ఉండేవి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఖాతాదారులు నెలకు కనీసం రూ. 500 నుంచి రూ. 1,000 వరకు బ్యాలెన్స్ ఉంచాల్సి ఉండేది. ఇలా చేయకపోతే రూ. 200 నుంచి రూ. 400 వరకు పెనాల్టీ చార్జీ వసూలు చేసేవారు. అలాగే పట్టణ ప్రాంతాలలో ఖాతాదారులకు మాత్రం కనీస బ్యాలెన్స్ రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు ఉండాల్సి ఉండేది. అలా డబ్బుని నిల్వ ఉంచుకొకపోతే రూ. 300 నుంచి రూ. 600 వరకు పెనాల్టీ విధించబడే అవకాశముండేది. ఈ చార్జీలను ప్రతి నెలా ఖాతాదారుల ఖాతాలో నుండే ఆటోమేటిక్‌గా డెబిట్ చేసేవారు. ఇప్పుడు ఈ పెనాల్టీలన్నీ పూర్తిగా తొలగించ బడటం ఖాతాదారులకు మేలు కలిగించనుంది.
ఈ మార్పుతో ఏమి లాభం?
పంజాబ్ నేషనల్ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం, తక్కువ ఆదాయ గలవారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. చిన్న ఉద్యోగులు, రైతులు, పింఛనుదారులు, గృహిణులు వంటి వారు ఖాతాలో కనీసం బ్యాలెన్స్ ఉంచాలన్న ఒత్తిడి ఇకపై ఉండాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, బ్యాంకింగ్ చేర్పు (Financial Inclusion) దిశగా ఇది ఒక మంచి ముందడుగు అని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా ఇకపై ఖాతాలు ప్రారంభించి, ఖర్చుల భయం లేకుండా అవి నిర్వహించుకోవచ్చు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు వంటి వారు నెలవారీ నిల్వలు నిర్వహించలేని పరిస్థితుల్లో కూడా ఎలాంటి భయం లేకుండా ఖాతాను కొనసాగించవచ్చు. ఇలా చూస్తే, ఈ మార్పు సామాన్యులకు ఆర్థిక స్వేచ్ఛను అందించడమే కాక, సమర్థవంతమైన బ్యాంకింగ్ వినియోగాన్ని కూడా ప్రోత్సహించనుంది.
ఈ బ్యాంకు ప్రస్తుతం కనీస బ్యాలెన్స్ జరిమానా మాత్రమే రద్దు చేయబడింది. ఇతర ఛార్జీలు (SMS అలర్ట్స్, ATM ఛార్జీలు, చెక్‌బుక్ ఛార్జీలు మొదలైనవి) మామూలుగా కొనసాగుతాయి. వాటిలో ఏ మార్పు లేదు అని గమనించ గలగాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మాత్రమే కాకుండా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా కనీస బ్యాలెన్స్ జరిమానా రద్దు చేశాయి. కెనరా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్న మొదటి ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకు ఇది 2025 జూన్ 1 నుండి రెగ్యులర్, శాలరీ, NRI ఖాతాలతో సహా అన్ని కేటగిరీల పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్ జరిమానా పూర్తిగా మాఫీ చేసింది.
PNB బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం, ఖాతాదారులకు ఆర్థిక భద్రతను కలిగించడమే కాక, గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ చేరువ కావడానికి కూడా దోహదపడుతుంది. ఇకపై మీ ఖాతాలో ఎంత ఉన్నా మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications