ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 0రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు జూలై 4, 2022 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 20 bps వరకు పెంచింది. 7 నుంచి 45 రోజుల మెచ్యూరిటీ వ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తుంది.
అలాగే 46 నుంచి 90 రోజుల మెచ్యూరిటీ వ్యవధితో డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 180 రోజులు లేదా ఒక సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటు ఇవ్వనుంది.91 నుంచి 179 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.00 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. 1 సంవత్సరం, రెండు సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, PNB ఇప్పుడు 5.30 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

2 సంవత్సరాలు, మూడు సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5.30 శాతం నుంచి 5.50 శాతానికి పెంచింది. మూడేళ్లు, ఐదేళ్ల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది. ఐదేళ్లు, పదేళ్ల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై PNB గరిష్ట వడ్డీ రేటు 5.60 శాతం లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు మెచ్యూరిటీలకు వర్తించే కార్డ్ రేట్లపై 50 bps అదనపు వడ్డీని పొందుతారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications