మొండి బకాయిలపై పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) కీలక ప్రకటన చేసింది. వచ్చే మార్చి నాటికి రూ.16వేల కోట్ల రికవరీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకు తెలుగువాడైన మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మల్లికార్జునరావు అన్నారు.
గ్రామాల్లో ఉన్న వారికి బ్యాంకింగ్ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో సంస్థ ప్రారంభించిన సంపర్క్ అభియాన్(GSA) కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రికవరీ చేయనున్న రుణాల్లో రూ.8వేల కోట్లు ఎన్సీఎల్టీ కింద ఉన్న కేసులను పరిష్కరించడం ద్వారా, మరో రూ.8వేల కోట్లు ఇతర బకాయిలను వసూలు చేయనున్నట్లు తెలిపారు.

లాభాల్లోకి బ్యాంకు
గతంలో నీరవ్ మోడీ, తాజాగా సింటెక్స్ వంటి కార్పోరేట్ డిఫాల్ట్‌లు వెలుగు చూశాయి. దీనికి కరోనా-లాక్ డౌన్ వంటి సమస్యలు తోడయ్యాయి. లోన్ మారటోరియం మరో ఇబ్బందిగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను PNB ఎదుర్కొంటోంది. క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ పనితీరుని మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్యాంకును లాభాల్లోకి తీసుకు వచ్చి, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ నాటికి రూ.308 కోట్ల నికర లాభాలు నమోదు చేశామన్నారు. దీనిని ఇలాగే కొనసాగిస్తామన్నారు.

నిరర్థక ఆస్తులు పెరగకపోవచ్చు
మొండి బకాయిలపై స్పందిస్తూ.. రూ.8,000 కోట్లు ఎన్సీఎల్టీ ద్వారా వసూలు కావొచ్చునని, మరో రూ.8,000 కోట్లు ఇతర మార్గాల్లో వసూలు చేసుకుంటామని చెప్పారు. దాదాపు రూ.93వేల కోట్లు వసూలు కావాల్సి ఉన్నప్పటికీ 652 రాని బాకీల ఖాతాలను ఎన్సీఎల్టీ బెంచీలకు నివేదించినట్లు తెలిపింది. ఇందులో 93 శాతం మొత్తాలు పూర్తి సెక్యూర్డ్ రుణాలు అన్నారు. బకాయిల రికవరీలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని భావిస్తున్నామన్నారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి మొత్తం రూ.4 లక్షల కోట్ల బకాయిలు దివాలా రిజల్యూషన్ ప్రక్రియలో ఉండగా, అందులో రూ.1,96,000 కోట్లు రికవరీ అయ్యాయన్నారు. బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 శాతం నుండి 3 శాతం కంటే పెరగకపోవచ్చునన్నారు.

విలీన ప్రక్రియపై...
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం తర్వాత PNB 11,000 శాఖలు, 13,000 ఏటీఎం నెట్ వర్క్‌తో దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. మార్చి నాటికి విలీన ప్రక్రియ సంపూర్ణం అవుతుందని చెప్పారు. PNBకి తెలంగాణలో 141 శాఖలు, ఆంధ్రప్రదేశ్‌లో 132 శాఖలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది రూ.37వేల కోట్ల వ్యాపారం జరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వ్యాపారవృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోను బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరిస్తామన్నారు. విలీనం తర్వాత PNB వ్యాపారం రూ.18 లక్షల కోట్లకు చేరుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో PNB ఖాతాదారుల వద్దకు వెళ్లి వారి బ్యాంకింగ్ అవసరాలు తీర్చే ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మల్లికార్జున రావు తెలిపారు. ఇందుకు విలేజ్ కాంటాక్ట్ ప్రోగ్రాంను చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 25,000 గ్రామాలకు PNB సిబ్బంది వెళ్తారన్నారు. నగర ప్రాంతాల్లో కార్పోరేట్ కస్టమర్లను కలిసి వారి అవసరాల ఏ మేరకు తీర్చగలమో పరిశీలిస్తామన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications