IPO News: గ్రేమార్కెట్లో దంచికొడుతున్న ఐపీవో.. ఆ కారణంగా ఎగబడి కొంటున్నారు..!!
PN Gadgil Jewellers IPO: దేశీయంగా స్టాక్ మార్కెట్లలో వరుస ఐపీవోల హడావిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో చాలా మంది తమ డబ్బును ఐపీవోలపై బెట్టింగ్ వేసేందుకు కుమ్మరిస్తున్నారు. గ్రేమార్కెట్లో కొత్తగా వస్తున్న కంపెనీల ప్రీమియంలు సైతం ఈ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ కంపెనీ ఐపీవో గురించే. ప్రధానంగా ప్రస్తుతం పసిడి, వెండి ధరలు భారీగా పెరిగిన వేళ అనేల లిస్టెడ్ జ్యువెలరీ స్టాక్స్ ఇప్పటికే ఇన్వెస్టర్ల కొనుగోళ్ల తాకిడిని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ ఐపీవోలో షేర్లను పొందేందుకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు దరఖాస్తులు చేసుకోవటంతో పాటు గ్రేమార్కెట్లో దూకుడు కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల నుంచి బలమైన స్పందన లభించటంతో బిడ్డింగ్ చివరి రోజైన గురువారం కంపెనీ షేర్లకు 59.41 రెట్లు సబ్‌స్క్రిప్షన్ వచ్చింది.

ఎన్ఎస్ఈ డేటా ప్రకారం కంపెనీ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.1,100 కోట్లను ఐపీవో ద్వారా సమీకరించేందుకు 1,68,85,964 షేర్లను విక్రయానికి ఉంటగా.. పెట్టుబడిదారుల నుంచి 1,00,31,19,142 షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.330 కోట్లను సమీకరించింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ కోటా 136.85 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 56.08 రెట్, రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల భాగం 16.58 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. ఇష్యూ తొలిరోజునే కొన్ని గంటల్లో ఫుల్ సబ్‌స్క్రిప్షన్ పొందింది.
కంపెనీ ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.456-480 ధరగా ఉంచింది. ఇక గ్రేమార్కెట్లో పరిస్థితులను పరిశీలిస్తే కంపెనీ ఒక్కో షేరుకు దాదాపు 71 శాతం ప్రీమియం పలుకుతోంది. ఈ లెక్కన ఒక్కో షేరుకు రూ.340 ప్రీమియం పలుకుతుండటంతో ఇదే పరిస్థితి కొనసాగితే లిస్టింగ్ రోజున షేర్లు ఒక్కోటి రూ.820గా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న జ్యూవెలరీ సంస్థ ఐపీవోలో షేర్ల తాజా ఇష్యూ ద్వారా రూ.850 కోట్లను సమీకరిస్తుండగా, మిగిలిన రూ.250 కోట్లు ప్రమోటర్ SVG బిజినెస్ ట్రస్ట్ ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తోంది. ప్రస్తుతం SVG బిజినెస్ ట్రస్ట్ PN గాడ్గిల్ జ్యువెలర్స్‌లో 99.9 శాతం వాటాను కలిగి ఉండగా, ఐపీవో తర్వాత ఈ ఆధిపత్యం తగ్గనుంది.


Click it and Unblock the Notifications