ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(PMSBY) స్కీంకు సంబంధించి ఈ నెల 31వ తేదీలోపు బ్యాంకులు ప్రీమియం మొత్తం రూ.12ను కట్ చేసుకుంటాయి. ఇప్పటికే బ్యాంకులు ఈ మేరకు కస్టమర్లకు నోటిఫికేషన్లు పంపిస్తున్నాయి. బ్యాంకు అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా ఈ మొత్తం డెబిట్ అవుతుంది. ఆ తర్వాత సబ్‌స్క్రైబర్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా దీనికి సంబంధించి సమాచారం అందిస్తాయి. బ్యాంకు ఖాతాదారు PMSBY పథకంలో చేరేటప్పుడు బ్యాంకు ఖాతాలో ఆటో డెబిట్‌లో చేరడానికి లేదా ప్రారంభించేందుకు సమ్మతి తప్పనిసరి.

ఖాతాదారులకు తెలియజేస్తుంది
PMSBY ప్రీమియం తగ్గింపు గురించి బ్యాంకులు వారి ఖాతాదారులకు ఎస్సెమ్మెస్ పంపించడం, ఇతర సమాచార మార్గాలద్వారా తెలియజేస్తుంది. PMSBY స్కీంలో చేరిన వారికి మాత్రమే బ్యాంకు ఖాతా నుండి డెబిట్ అవుతుంది. ఒక బ్యాంకులో ధరఖాస్తును నింపడం ద్వారా లేదా బ్యాంకు నెట్ బ్యాంకింగ్‌కు లాగ్-ఇన్ అయి ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేయడం ద్వారా కూడా PMSBY స్కీంలో చేరవచ్చు. PMSBY కవరేజ్ కాలం ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఉంటుంది. అందుకే ఈ పథకాన్ని కొనసాగించాలని భావిస్తే ప్రతి సంవత్సరం మే నెలలో రెన్యువల్ ప్రీమియం చెల్లించాలి. ఈ పథకంలో చేరేటప్పుడు బ్యాంకు ఖాతాలో ఆటో డెబిట్‌లో చేరడానికి లేదా ప్రారంభించేందుకు సమ్మతిని ఇవ్వాలి. ఈ బీమా ఒక సంవత్సరం కవర్ చేస్తుంది.

స్కీంలో చేరడానికి అర్హులు
ప్రతి సంవత్సరం బ్యాంకు ఖాతా రూ.12 కట్ అయి ఆటోమేటిక్‌గా బీమా పునరుద్ధరణ అవుతుంది. మీ బ్యాంకు ఖాతా నుండి సాధారణంగా ప్రతి ఏడాది మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ మధ్య డెబిట్ అవుతుంది. బ్యాంకు ఖాతా ఉన్న 18 నుండి 70 సంవత్సరాల లోపు వారంతా ఈ పథకంలో చేరవచ్చు. ఒకటి లేదా వేర్వేరు బ్యాంకుల‌్లో ఒక వ్యక్తి కలిగి ఉన్న బహుళ బ్యాంకు ఖాతాల విషయంలో వ్యక్తి ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ స్కీంలో చేరడానికి అర్హులు.

బీమాను తీసివేయించాలి
ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు ఈ మొత్తాన్ని కట్ చేసుకుంటే మీరు ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటున్న చోట మినహా మిగతా వాటిని సంప్రదించి ఆ బ్యాంకులో ఈ బీమాను తీసివేయించాలి. PMSBY అనేది ప్రమాద బీమా పథకం. ప్రమాదం కారణంగా మరణం లేదా వైకల్యం కోసం బీమా అందించబడుతుంది. గుండెపోటు మొదలైన సహజ కారణాల వల్ల జరిగే మరణాలకు బీమా కవర్ ఉండదు. ఈ పథకం కింద రిస్క్ కవరేజ్ ప్రమాదవశాత్తు మరణం, పూర్తి వైకల్యానికి రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష, ఖాతాదారు మరణం తర్వాత బీమా చేసిన వ్యక్తి నామినీ బ్యాంకు ఖాతాకు బీమా క్లెయిమ్ చెల్లించబడుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications