Housing scheme: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గృహాల కొనుగోళ్లు మందగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను అతిత్వరలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తక్కవ ఆదాయ వర్గాలు సరసమైన ధరల్లో గృహాలు నిర్మించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది.
ఆర్థికంగా బలహీన వర్గాలు ఇళ్లు కట్టుకునేందుకు సహాయం అందించడానికి 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం ప్రారంభించింది. జూన్ 25, 2015న ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు చొరవతో దీన్ని సక్సెస్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన దాదాపు 1.12 కోట్ల మంది ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందుతారని భావిస్తోంది.

PMAY పథకం రెండు భాగాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల కోసం PMAY-U మరియు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి PMAY-R రూపొందించబడింది. ఆర్థికంగా వెనుకబడిన విభాగం కోసం నిర్మించే గృహాలు గరిష్టంగా 30 చ.మీ కార్పెట్ ఏరియాతో ఉండాల్సి ఉంటుంది. ఇందులో మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. అందుకే కుటుంబంలోని మహిళ ఏకైక లేదా సహ యజమానిగా కొనసాగడం తప్పనిసరి చేసింది.
ఈ పథకం నుంచి ప్రయోజనం పొందాలంటే సదరు కుటుంబానికి దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు. లబ్దిదారుని కుటుంబం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి గృహనిర్మాణ పథకంలోనూ సహాయాన్ని పొంది ఉండకూడదు. దీనికి అర్హతను నిర్ణయించే క్రమంలో సదరు లబ్ధిదారుడి సంవత్సర ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటోంది.
ఆదాయం ఆధారంగా ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS) 3 లక్షల వరకు 30 చ.మీల విస్తీర్ణం, తక్కువ ఆదాయ సమూహం (LIG)కు 3 నుంచి 6 లక్షల లోపు 60 చ.మీలు, మధ్య ఆదాయ సమూహం I (MIG I)కు 6 నుంచి 12 లక్షల మేర 160 చ.మీ, MIG II కోసం 12 నుంచి 18 లక్షల మధ్యస్థాయిలో ఉంటే 200 చ.మీ ఇంటి నిర్మాణానికి కేంద్రం సాయం అందించనుంది.
PMAY పథకం లబ్ధి పొందేందుకుక అధికారిక వెబ్‌సైట్ pmaymis.gov.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. సిటిజన్ అసెస్‌మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తగిన కేటగిరీని ఎంచుకుని ఆధార్ వివరాలను సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, అవసరమైన పత్రాలతో పాటు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత లబ్ధిదారుడు గృహ రుణాలపై రాయితీ ప్రయోజనాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications