Loan News: శుభవార్త.. ఈ స్కీమ్ కింద రుణం తీసుకుంటే వడ్డీ క్యాష్‌బ్యాక్.. పూర్తి వివరాలు
PM Svanidhi Yojana: దేశంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు అనుకూలమైన పథకాలను కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రవేశపెడుతూనే ఉంది. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు వీటి ద్వారా పూచీకత్తు లేకుండా రుణాలను అందించేందుకు స్కీమ్స్ సహాయపడుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రధానమంత్రి స్వానిధి యోజన స్కీమ్ గురించే. జూలై 23న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి ఓ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద రోజువారీ వేతన వీధి వ్యాపారుల జీవితాలను మార్చడానికి ప్రధానమంత్రి స్వానిధి పథకం విజయం ఆధారంగా ఎంపిక చేసిన నగరాల్లో ప్రతి సంవత్సరం 100 వీక్లీ 'మార్కెట్లు' లేదా స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం మద్దతు ఇన్వనుంది.

జూన్ 1, 2020న గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని PM Svanidhi ప్రారంభించింది. ఈ పథకంలో ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణం ఇవ్వాలనే నిబంధన ఉంది. 10,000 వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ సదుపాయం ఒక సంవత్సర కాలానికి ఎటువంటి హామీ లేకుండా అందించబడుతుంది. ఈ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే.. రెండవ విడతలో వారికి రూ.20,000 నుంచి రూ.50,000 రుణం అందించబడుతుంది.
ఏడాదికి 7 శాతం చొప్పున వడ్డీ రాయితీ ద్వారా రెగ్యులర్ రీ-పేమెంట్ ప్రోత్సహించబడుతుంది. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు సంవత్సరానికి రూ.1,200 వరకు క్యాష్‌బ్యాక్ ద్వారా ప్రోత్సహించబడతాయి. ప్రధానమంత్రి స్వానిధి యోజన కింద ప్రారంభంలో రూ.10,000 వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందించడం ప్రారంభించిన విషయం తెలిసిందే. తర్వాత మరిన్ని రుణాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 09 ఏప్రిల్ 2021 నుంచి రూ.20,000 వరకు రెండవ విడత రుణం ఇవ్వడం ప్రారంభించబడింది. ఇక చివరిగా మూడో విడతలో విజయవంతంగా చెల్లింపులు చేసిన వారికి రూ.50,000 వరకు రుణ సాయం ఇవ్వటాన్ని 1 జూన్ 2022 నుంచి ప్రారంభించారు.
లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్రాలు/UTలు/ULBలు/క్రెడిట్ అందించే సంస్థలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించడం, రేడియో జింగిల్స్, టెలివిజన్ ప్రకటనలు, వార్తాపత్రిక ప్రకటనల ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటివి ఉంటాయి.


Click it and Unblock the Notifications