PM Surya Ghar Muft Bijli Yojana: దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు చదరంగం మెుదలెట్టాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అతిపెద్ద తాయిలాన్ని ప్రజలకు ప్రకటించింది. ఎన్డీఏ హామీతో దాదాపు 78,000 ప్రయోజనం పొందేందుకు అనేక మంది ఎగబడుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించే. రాజకీయ పార్టీల ఊహలకు అందని రీతిలో దీనిని ప్రధాని ప్లాన్ చేశారు. దీని కింద దేశంలో దాదాపు కోటి కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందేందుకు రూపొందించబడింది. అయితే ఇప్పటి వరకు కోటి కంటే ఎక్కువ కుటుంబాలు ఈ స్కీమ్ కోసం నమోదు చేసుకోవటం పెద్ద విజయంగా భావిస్తున్న మోదీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కేవలం నెలలోనే ప్రజల నుంచి విశేష స్పందన లభించటంపై ప్రధాని ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో వెల్లడించారు.

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. అసోం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 5 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ చొరవ పెద్ద ఎత్తున గ్రహానికి పర్యావరణ అనుకూల వాతావరణాన్ని అందించడం ద్వారా లైఫ్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌కి దోహదపడుతుంది. ఉచిత విద్యుత్ పథకం ద్వారా కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేయడం లక్ష్యం.
ఈ పథకం కింద ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో లబ్ధిదారులకు రూ.78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. దీంతో లబ్ధిదారునికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందడంతో పాటు ఏటా రూ.18,000 ఆదా అవుతుందన్నారు. ఈ పథకం కింద 1 kW సామర్థ్యం గల సోలార్ ప్యానెల్‌లకు రూ.30,000, 2 kW సామర్థ్యం గల ప్యానెల్‌లకు రూ.60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ ప్యానెళ్లకు రూ.78,000 సబ్సిడీ లభిస్తుంది.
దరఖాస్తు చేసుకునే ప్రక్రియ..
- ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.inను సందర్శించాలి.
-దీని తర్వాత అప్లై ఫర్ రూఫ్‌టాప్ సోలార్ ఎంచుకోండి.
-దీని తర్వాత మీరు మీ రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, విద్యుత్ వినియోగదారు సంఖ్య, మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌ను ఎంచుకోవాలి.
- దీని తర్వాత మీరు వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి.
-ఇక్కడ ఒక ఫారమ్ ఉంటుంది, అందులో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌ల కోసం దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసిన తర్వాత మీరు సాధ్యత ఆమోదం కోసం వేచి ఉండాలి.
- ఆమోదం పొందిన తర్వాత మీ డిస్కామ్‌లో నమోదు చేసుకున్న ఏ విక్రేత నుంచి అయినా ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు వివరాలతో నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
- డిస్కం ద్వారా నెట్ మీటర్ ఇన్‌స్టాలేషన్, ధృవీకరణ తర్వాత, మీరు పోర్టల్ నుంచి కమీషనింగ్ సర్టిఫికేట్ పొందుతారు. కమీషనింగ్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మీరు క్యాన్సిల్డ్ చెక్, బ్యాంక్ ఖాతా వివరాలను పోర్టల్‌లో సమర్పించాలి.
-సబ్సిడీ డబ్బు వివరాలు సమర్పించిన 30 రోజులలోపు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.


Click it and Unblock the Notifications