Patanjali Ads: యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆయుర్వేదు ఉత్పత్తుల వ్యాపార సామ్రాజ్యం దేశంలో అతిపెద్దది. చాలా కాలంగా ఈ కంపెనీ ఉత్పత్తుల క్వాలిటీ, అడ్వర్టైజింగ్ వంటి అంశాల్లో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.
తాజాగా ఈ కంపెనీకి చెందిన ఆయుష్ ఉత్పత్తుల తప్పుదోవ పట్టించే ప్రకటనలతో వ్యవహరించే చట్టాన్ని పదేపదే ఉల్లంఘించినందుకు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌పై వచ్చిన ఫిర్యాదుపై "తగిన చర్యలు" తీసుకోవాలంటూ ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆయుష్ మంత్రిత్వ శాఖను ఆదేశాలు రావటం పెద్ద చర్చకు దారితీసింది. జనవరి 24న పీఎంవో ఆదేశాల మేరకు ఫిబ్రవరి 2022 నుంచి పెండింగ్ అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ఆయుష్ శాఖకు ఆందేశాలు జారీ అయ్యాయి.

ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ (SLA) రెండూ కూడా ఈ విషయంపై అనేక RTIలు ఉన్నప్పటికీ, పతంజలి ఆయుర్వేద్ మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్, గుండె జబ్బులకు సంబంధించిన ఔషధాల గురించి తప్పుదారి పట్టించే ప్రకటనలపై చర్యలకు రంగంలోకి దిగుతున్నాయి. పతంజలి ఆయుర్వేద్ DMR(OA) చట్టం-1954ని పదే పదే ఉల్లంఘించడంపై జనవరి 15న ఆర్టీఐ కార్యకర్త డాక్టర్ KV బాబు ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసిన తర్వాత ఉత్తరాఖండ్ SLAకి పై ఆదేశాలు వచ్చాయి.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఉత్తరాఖండ్‌లోని ఎస్‌ఎల్‌ఎలకు ఫిబ్రవరి 2022 నుంచి తన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని బాబు ప్రధాని కార్యాలయానికి పంపిన ఫిర్యాదు లేఖలో పొందుపరిచాడు. వివిధ సందర్భాల్లో కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో కూడా బాబు ధ్వజమెత్తారు. పార్లమెంటేరియన్లు డాక్టర్ వి శివదాసన్, కార్తి పి చిదంబరం గత ఏడాది కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు.
2022లో దివ్య మధుగ్రిత్ (15 ఉల్లంఘనలు), దివ్య లిపిడోమ్ (7 ఉల్లంఘనలు), దివ్య ఐగ్రిట్ గోల్డ్ (10 ఉల్లంఘనలు), దివ్య బిపిగ్రిట్ (18 ఉల్లంఘనలు) ప్రకటనలను ఆయుష్ మంత్రిత్వ శాఖ ఫార్వార్డ్ చేసిందని గత ఏడాది మార్చి 28న లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. రెండు ప్రఖ్యాత ప్రాంతీయ వార్తా పత్రికల్లో సైతం పతంజలి తప్పుడు యాడ్స్ ప్రచురించినట్లు ఆయన ఆయుష్ మంత్రిత్వ శాఖకు వెల్లడించారు. ఈ వార్తలు పతంజలి ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద దుమారానికి కారణమైంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications