ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం పారిస్ నుండి అమెరికా చేరుకున్నారు. గురువారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) Xలో ప్రధాని మోదీ స్వయంగా వాషింగ్టన్ డీసీకి చేరుకున్నట్లు తెలియజేస్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేసారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య నేడు ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ హౌస్ కు అతిథిగా వచ్చిన మూడవ విదేశీ నాయకుడు నరేంద్ర మోడీ. భారతదేశం - అమెరికా మధ్య సంబంధాలకు నరేంద్ర మోడీ ఈ పర్యటన ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది.
అమెరికా చేరుకున్న తర్వాత, ప్రధాని మోదీ అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. వాషింగ్టన్ డీసీలో తులసి గబ్బర్డ్ తో జరిగిన సమావేశంలో ఆమెను అభినందింస్తూ భారతదేశం-అమెరికా స్నేహానికి సంబంధించిన వివిధ అంశాలను ఆమెతో చర్చించానని ప్రధాని మోదీ అన్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలకు ఆమె ఎల్లప్పుడూ మద్దతుదారుగా ఉంది.

స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
అమెరికాకు చేరుకున్న నరేంద్ర మోడీకి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. వాషింగ్టన్ డిసిలో భారత ప్రవాసులు నాకు చాలా ప్రత్యేకమైన స్వాగతం పలికారు. మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడానికి, భారతదేశం-అమెరికా ప్రపంచ భాగస్వామ్యాన్నిమరింత ముందుకు తీసుకెళ్లడానికి నేను ఎదురు చూస్తున్నాను. ప్రజలకు మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తాం. ఈ రెండు దేశాల ప్రపంచ భాగస్వామ్యంలో ఇది ఒక కొత్త అధ్యాయం అని ట్వీట్ ద్వారా అన్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అమెరికా క్యాబినెట్ సభ్యులు, పరిశ్రమల ప్రముఖులను కలుస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఫ్రాన్స్ తర్వాత ఇప్పుడు అమెరికా
ఫ్రాన్స్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ అమెరికాకు చేరుకున్నారు. ఫ్రాన్స్‌లో మోడీ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి పారిస్ AI యాక్షన్ సమ్మిట్‌కు అధ్యక్షత వహించి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కృత్రిమ మేధస్సు గురించి కూడా చర్చించారు. ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇది భారతదేశానికి ఒక పెద్ద విజయం. ఫ్రాన్స్ అధ్యక్షుడితో కూడా ఆయన ఎన్నో అంశాలపై చర్చించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications