భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నిన్న అంటే బుధవారం సాయంత్రం తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఇక్కడ రైల్వే జోన్‌కు అలాగే అనకాపల్లి జిల్లాలోని పూడిమడకలో ఎన్‌టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేశారు. రైలు, రోడ్డు రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (NREDCAP) మధ్య జాయింట్ గ్రీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్ ప్రారంభం. మొదటి దశలో 2,500 ఎకరాల ల్యాండ్ పార్శిల్‌లో రూ. 1,518 కోట్లతో నిర్మించనున్న కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్‌కు ప్రధాని వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. నక్కపల్లిలో రూ.1,877 కోట్లతో బల్క్ డ్రగ్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు. 11,542 కోట్ల పెట్టుబడితో, 2,002 ఎకరాల స్థలంలో బల్క్ డ్రగ్ పార్క్‌తో 54 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. 2024లో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ప్రధాని ఏపీ పర్యటన పోర్ట్ సిటీలో రోడ్‌షోతో ప్రారంభమైంది, తరువాత వినాయకుడి ఆలయం వద్ద ప్రారంభమైన రోడ్‌షో బహిరంగ సభకు వేదికైన ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ముగిసింది.
పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. 60 ఏళ్ల విరామం తర్వాత, ప్రజల ఆశీర్వాదంతో దేశంలో వరుసగా మూడోసారి కేంద్ర ప్రభుత్వం ఎన్నికైందని, ఆ తర్వాత అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇది తన తొలి కార్యక్రమం అని అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ అవకాశాల రాష్ట్రం అని మోదీ అన్నారు. ఈ అవకాశాలు నెరవేరితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అలాగే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని తెలిపారు. అలాగే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని మోదీ హైలైట్ చేశారు. ఈ విజన్‌ను సాకారం చేసుకునేందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 'స్వర్ణ ఆంధ్ర@2047' కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు.


Click it and Unblock the Notifications