మీరు పియం ముద్ర(pm mudra loan) లోన్ గురించి వినే ఉంటారు. ఈ స్కిం ఇప్పటివరకు వ్యాపారాలు చేసే ఎంతో మందికి ఆర్ధికంగా ఉపయోగపడింది. అయితే ఈ స్కిం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఏదైనా వ్యాపారం చేయాలన్న, వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునేవారికి ఆర్ధికంగా ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ పీఎం ముద్రా యోజన కింద సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు లోన్ ఇచ్చే, ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన పథకం. కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 8న తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా కార్మికులు, రైతులు సహా ఇతర అసంఘటిత (uncategorized) వారు కూడా లోన్ పొందవచ్చు.

10 ఏళ్లు పూర్తి: పీఎం ముద్రా యోజన స్కీమ్ ప్రవేశపెట్టి 10 ఏళ్లు కావొస్తుంది. ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు షూరిటీ లేని లోన్లను ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఇస్తున్నాయి.
ఎంత లోన్ ఇస్తారంటే: ఈ ముద్రా లోన్లు మూడు కేటరీల్లో ఉంటాయి: 1.శిశు, 2.కిషోర్, 3. తరుణ్. శిశు కేటగిరీలో రూ.50 వేల వరకు, కిషోర్ కేటగిరీలో రూ.50 వేల నుండి రూ.5 లక్షల వరకు, తరుణ్ కేటగిరీలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్లు ఇస్తారు. అయితే మొదట తీసుకున్న లోన్లను సరైన టైంలో కట్టినవారికి తరుణ్ ప్లస్ కేటగిరీలో రూ.20 లక్షల వరకు కూడా లోన్ ఇస్తుంది. బడ్జెట్ సమయంలో నిర్మలా సీతారామన్ ఈ ముద్రా లోన్ పరిమితి పెంపును ప్రకటిస్తూ, ఇప్పటికే లోన్ తిరిగి చెల్లించిన వారికి లోన్ లిమిట్ రూ. 20 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ప్రధానమంత్రి ముద్ర లోన్ పథకం కింద 35% సబ్సిడీతో రూ.10 లక్షల వరకు లోన్ పొందవచ్చు,
ముద్ర లోన్ అర్హత ప్రమాణాలు : PM ముద్రా లోన్ (https://www.mudra.org.in/)కి అర్హత పొందడానికి దరఖాస్తుదారులు ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో డిఫాల్టర్‌గా ఉండకూడదు. మంచి క్రెడిట్ హిస్టరీ ఉండాలి. అలాగే ప్రారంభించాలనుకుంటున్న వ్యాపారంలో అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ లోన్ కోసం ఎలాంటి సెక్యూరిటీ లేదా తనఖా పెట్టాల్సిన అవసరం లేదు.
కావలసిన డాకుమెంట్స్ : ముద్ర లోన్ కోసం అప్లయ్ చేయడానికి గుర్తింపు కార్డు, పాన్ కార్డ్, రెసిడెన్స్ సర్టిఫికెట్, కొనుగోలు చేసిన వస్తువులకు కొటేషన్లు, బిజినెస్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్, ప్రస్తుత మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలి
1. మొదట మీరు ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న బ్యాంకుకి వెళ్ళండి.
2. ప్రధానమంత్రి ముద్ర లోన్ గురించి బ్యాంకు అధికారి నుండి సమాచారాన్ని అడిగి తెలుసుకోండి.
3. అప్లికేషన్ తీసుకొని మీ పూర్తి వివరాలను ఫామ్‌లో నింపండి.
4. మీ అప్లికేషన్ ఫామ్‌కు అవసరమైన అన్ని డాకుమెంట్స్ జిరాక్స్ అటాచ్ చేయండి.
5. మీరు నింపిన ఫామ్ అలాగే డాకుమెంట్స్ బ్యాంకు అధికారికి సబ్మిట్ చేయండి.
6. బ్యాంకు మీ అప్లికేషన్ ఇంకా డాకుమెంట్స్ వెరిఫై చేస్తుంది.
7. చివరికి మీకు అర్హత ఉంటే మీకు కొన్ని రోజుల్లో లోన్ ఆమోదం లభిస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications