పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వ పటిమను కొనియాడారు. అసోచామ్ ఫౌండేషన్ వీక్ 2020 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడిన రతన్ టాటా కరోనా సంక్లిష్ట సమయంలో కూడా ఎలాంటి తడబాటు లేకుండా దేశాన్ని ముందుకు నడిపించారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కష్ట సమయంలో తడబడలేదని, తప్పించుకోలేదని, దేశాన్ని ముందుకు నడిపించారని పేర్కొన్న రతన్ టాటా స్పష్టం చేశారు.

కరోనా సమయంలో మోడీ నిర్ణయాలు స్పూర్తిదాయకం : రతన్ టాటా
తాను వ్యాపారంలో ఉన్న సమయంలోనూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేయాలనుకుంటున్నా దానిపై గౌరవం ఉందని, కరోనా మహమ్మారి తో దేశం పోరాడిన అత్యంత చెత్త సంవత్సరంలో కూడా ఆయన అందించిన నాయకత్వం, ఆర్థిక భరోసా స్ఫూర్తిదాయకమని, తాను ఎప్పటికీ గౌరవిస్తానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గొప్ప నాయకులుగా కొనియాడారు. కరోనా సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరించిన విధానాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ గత వారమే కొనియాడారు.

మోడీ షో మ్యాన్ కాదు , పై పై మెరుగుల మనిషి కాదు
ఇక తాజాగా నరేంద్ర మోడీకి బాహ్య సౌందర్యాన్ని ప్రదర్శించే పైపై మెరుగులు లేవని, షో మ్యాన్ అంతకంటే కాదని రతన్ టాటా అభిప్రాయం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ పై వ్యతిరేకత ఉన్న, కొన్ని వర్గాలలో అసంతృప్తి ఉన్న ఎప్పుడు వెనక్కి తగ్గలేదని, పారి పోలేదని వ్యాఖ్యానించారు. కరోనా లాక్డౌన్ సమయంలో దేశం కొన్ని నిమిషాల పాటు లైట్లు ఆర్పి వేయాలని కోరుకున్నారని గుర్తు చేశారు. దేశం మొత్తాన్ని ఏకం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు, మీ కృషి దేశాన్ని సరైన మార్గంలో పెడుతుందని రతన్ టాటా వ్యాఖ్యానించారు.

కరోనా సమయంలో ఆర్ధిక సంస్కరణలు అద్భుతం
కరోనా వైరస్ పై నియంత్రణ ప్రయత్నం ఏప్రిల్-జూన్లో భారత ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో 23.9% పతనానికి దారితీసింది, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.5% సంకోచం జరిగింది. దేశంలోని పేదలకు ఉచిత ఆహారం మరియు ఉపాధి కల్పించడానికి ఆర్థిక సహాయాన్ని పెంచేటప్పుడు వృద్ధిని పెంచడానికి క్రెడిట్ మద్దతును పెంచడానికి భారత ప్రభుత్వం భారీ ద్రవ్య మద్దతుతో సహా అనేక చర్యలు తీసుకుందని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. ఈ కాలంలో కార్మిక సంస్కరణలు మరియు వ్యవసాయ సంస్కరణల ద్వారా ముందుకు రావడం సహా మోడీ ప్రభుత్వం సంస్కరణ మార్గంలో అడుగుపెట్టిందని అన్నారు .

మోడీ నాయకత్వ ప్రయోజనాలను పారిశ్రామిక వర్గాలు చూపించాల్సిన సమయం
అదే సమయంలో భారతదేశాన్ని స్వావలంబన చేయడానికి 10 రంగాలకు పైగా ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకాలు వంటి విధానాలను రూపొందించారని ఆయన పేర్కొన్నారు. ఈ నాయకత్వం యొక్క ప్రయోజనాలను భారత పారిశ్రామిక రంగం ఇప్పుడు చూపించాలని టాటా అన్నారు.ఈ నాయకత్వం యొక్క ప్రయోజనాలను చూపించడం ఇప్పుడు పారిశ్రామిక వర్గాలుగా మా పని, ఇది మేము చేస్తామని తనకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు రతన్ టాటా .

దేశాన్ని ముందుకు నడిపించగల గొప్ప నాయకత్వం మోడీది : రతన్ టాటా
గత కొన్నేళ్లుగా తాను భారతదేశాన్ని చూసినట్లుగా కాకుండా, మనం కలిసి ఏకంగా పని చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని, అలా అందరినీ ఏకం చేసినందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. ఈ కష్టమైన కాలంలో దేశాన్ని ముందుకు నడిపించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక వర్గాలంతా కలిసి నిలబడి, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినదానిని అనుసరిస్తే ప్రపంచం భారత్ వైపు తప్పక చూస్తుందని, ప్రధానమంత్రి ద్వారా అది జరగవచ్చని చెప్పారు . ఇప్పటికే ఆయన అలా జరిగేలా చేశాడు అంటూ రతన్ టాటా పేర్కొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications