PM MOdi: వివాహ వేడుకలపై PM మోదీ ఆందోళన.. 'మన్‌ కీ బాత్' వేదికగా ప్రజలకు విజ్ఞప్తి

PM MOdi: అన్ని విషయాల్లో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ ఈవెంట్స్ నిర్వహించేందుకు ఇటీవల ఢిల్లీలో యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌ను PM ప్రారంభించారు. తాజాగా విదేశాల్లో చేసుకుంటున్న పెళ్లిళ్లపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశ ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవడానికి భారత్ వెలుపల ప్రదేశాలను ఎంచుకోవద్దని PM మోదీ విజ్ఞప్తి చేశారు. ఇక్కడే అందుబాటులో ఉన్న ప్రాంతాలను ఉపయోగించుకోవాలని కోరారు. భారత గడ్డపై, మన ప్రజల మధ్య వేడుకలు జరుపుకుంటే.. దేశ సొమ్ము ఇక్కడే ఉంటుందన్నారు. 'వోకల్ ఫర్ లోకల్'లో ఇదో పెద్ద ముందడుగు అని 'మన్‌ కీ బాత్' 107వ ఎపిసోడ్‌లో తెలిపారు.

PM Modi urged people to celebrate marriages in India instead of other countries

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కాగా.. దాదాపు 5 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇందుకోసం షాపింగ్ చేసే సమయంలో దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ కోరారు. అయితే పెళ్లి విషయంలో ఓ విషయం కలవర పెడుతుందన్నారు. 'కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే సాంప్రదాయాన్ని సృష్టిస్తున్నాయి, ఇది మనకు అవసరమా?' అని ప్రశ్నించారు.

'వివాహాల వల్ల ఆర్థిక వ్యవస్థలోకి పెద్ద స్థాయిలో నగదు ప్రవహిస్తుంది. ఈ భారీ వేడుకలు దేశంలో జరిగితే పేద ప్రజలకు ఏదో ఒక పనిచేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికితోడు వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. పెద్ద కుటుంబాలు ఎక్కువ మొత్తంలో వెచ్చిస్తుంటాయి కాబట్టి నా బాధ వారికి చేరుతుందని ఆశిస్తున్నాను' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+