బెంగళూరులో ట్రాఫిక్ అంటే ప్రజలకు సమస్య. ముఖ్యంగా సిల్క్ బోర్డ్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు రోజువారీ బాధగా మారాయి. అయితే, ఆగస్టు 10 నుంచి ఈ పరిస్థితి కొంతమేరకు మారబోతుంది. ఎందుకంటే... ప్రధాని నరేంద్ర మోదీ ఆ రోజు బెంగళూరు మెట్రోలో నూతనంగా నిర్మితమైన యెల్లో లైన్ ను అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. ఆయన పేర్కొంటూ, "ప్రధాని మోదీ మద్దతుతోనే ఈ ప్రాజెక్టు తక్షణం పూర్తి చేయగలిగాం. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణే," అని అన్నారు.
నూతనంగా ప్రారంభించనున్న యెల్లో లైన్ మార్గం ఆర్వీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు విస్తరించింది. మొత్తం 19.15 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో 16 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టు రూ. 5,056.99 కోట్లు ఖర్చుతో నిర్మించబడింది. ఇది రోజుకు 8 లక్షల వరకు ప్రయాణికులకు సేవలు అందించగలదని అంచనా. ఇది పూర్తిగా ప్రారంభమైతే, బెంగళూరులోని అత్యంత రద్దీగా మారిన సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను గణనీయంగా తగ్గించగలదు. ముఖ్యంగా దక్షిణ బెంగళూరుతో ఐటీ కారిడార్‌ను కలిపే మార్గంగా ఇది కీలకంగా మారబోతోంది.
యెల్లో లైన్ బెంగళూరులో మొట్టమొదటి డ్రైవర్‌లెస్ ట్రైన్‌లను ప్రారంభించనుంది. ప్రారంభంలో మూడు ట్రైన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని ట్రైన్‌లు వస్తే మెరుగైన సేవలు అందుతాయి. ఇది ప్రయాణికులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. యెల్లో లైన్‌లో సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద నిర్మించిన డబుల్ డెక్కర్ వయాడక్ట్ (పైన మెట్రో, కింద రోడ్ ట్రాఫిక్) దక్షిణ భారతదేశంలోనే మొదటిది. ఇది ట్రాఫిక్ సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదట్లో ప్రతి 25 నిమిషాలకు ఒక ట్రైన్ మాత్రమే నడుస్తుంది, ఎందుకంటే తగినన్ని ట్రైన్‌లు ఇంకా అందుబాటులో లేవు. పూర్తిస్థాయిలో 15 ట్రైన్‌లు వచ్చిన తర్వాత, ఫ్రీక్వెన్సీ చాలా పెరుగుతుంది (సుమారు 5 నిమిషాలకు ఒక ట్రైన్). ఇది పూర్తిగా అందుబాటులోకి రావడానికి 2026 మార్చి వరకు పట్టవచ్చు.
ఆగస్టు 15న ప్రజల కోసం అందుబాటులోకి
ప్రారంభోత్సవం ఆగస్ట్ 10న జరిగితే, ఈ మెట్రో లైన్‌ను ఆగస్టు 15న ప్రజల రాకపోకలకు తెరవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమయానికి పూర్తి చేయాలన్న ప్రధాని మోదీ ప్రాధాన్యతే ప్రాజెక్టు వేగంగా పూర్తవడానికి కారణమని తేజస్వి సూర్య చెప్పారు.
ఇంతటితో కాకుండా, ప్రధాని మోదీ అదే రోజు బెంగళూరు మెట్రో ఫేజ్ 3 ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ దశలో 44.65 కిలోమీటర్ల మెట్రో మార్గం నిర్మించనున్నారు. దీని మొత్తం వ్యయం రూ. 15,611 కోట్లు అని కేంద్ర నగరాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
బెంగళూరు నగర ప్రజలు మెట్రో విస్తరణ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో వేసవిలోనూ, వర్షాకాలంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, మెట్రో మార్గాల విస్తరణ వలన ప్రయాణ సమయం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బెంగళూరు మెట్రో యెల్లో లైన్ ప్రారంభం కేవలం రవాణా మార్గం ప్రారంభం మాత్రమే కాదు. ఇది నగర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికై మరో మెట్టు. ఆగస్టు 10న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ మార్గం, నగర వృద్ధికి మరో గొప్ప మైలురాయిగా నిలవనుంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

బెంగళూరు అద్దెలు షాకింగ్: సామాన్యుల పరిస్థితి ఏంటి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications