G20 Meeting: భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లను ఉద్ధేశించి ప్రసంగించారు. దేశాలు భరించలేని అప్పులను కలిగి ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థలకు ముప్పు కలిగి ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై నమ్మకం సన్నగిల్లిందని, ఆహారం & ఇంధన భద్రత ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆందోళనగా మారిందని మోదీ అన్నారు.
ప్రధాన సమస్యలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహారం & ఇంధన భద్రత ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆందోళనలుగా మారాయని ప్రధాని అన్నారు. దేశాల ఫైనాన్సియల్ స్టెబిలిటీకి రుణ స్థాయిల వల్ల ముప్పు పొంచి ఉందని అన్నారు. దేశాలు వీటి సంస్కరణల విషయంలో నెమ్మదిగా ఉండటమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, విశ్వాసం, వృద్ధిని తిరిగి తీసుకురావడం 'ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు, ద్రవ్య వ్యవస్థల సంరక్షకుల'పై ఉందని అన్నారు.

అధిక ద్రవ్యోల్బణం..
ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం వల్ల పెరుగుదున్న ధరల కారణంగా చాలా సమాజాలు నష్టపోతున్నాయని మోదీ అన్నారు. దీనికి పొరుగుతున్న సంక్షోభంలో ఉన్న శ్రీలంక, పాకిస్థాన్ పరిస్థితిని ఉదాహరణగా సూచించారు. కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థలకు అతిపెద్ద దెబ్బ తగిలిందని ప్రధాని ఈ సమావేశంలో పేర్కొన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ..
భారతీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా, నమ్మకంగా ఉన్నారని ప్రధాని వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వారు అదే సానుకూల స్ఫూర్తిని అందించగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు. చర్చలు ప్రపంచంలోని అత్యంత బలహీనమైన పౌరులపై దృష్టి పెట్టాలని మోదీ అన్నారు. ప్రపంచ జనాభా 8 బిలియన్లు దాటినప్పటికీ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పురోగతి మందగిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

వాతారవణ మార్పులు..
ప్రపంచ ఎదుర్కొంటున్న అత్యంత ప్రధాన సమస్యల్లో వాతావరణ మార్పులు, అధిక రుణ స్థాయిలు ఉన్నాయని అన్నారు. సాంకేతికత శక్తిని మంచి కోసం ఎలా ఉపయోగించవచ్చో ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు అన్వేషించాలని ప్రధాని మోదీ కోరారు. ఈ క్రమంలో భారత్ లో పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సృష్టించిన విషయాన్ని మోదీ ప్రస్థావించారు. UPI డిజిటల్ చెల్లింపులు ప్రజల జీవితాన్ని సమూలంగా మార్చిందని జీ20 దేశాల ప్రతినిధులకు మోదీ వెల్లడించారు.


Click it and Unblock the Notifications