PM Modi News: ఎవరైనా క్యూట్‌గా ఉన్న పిల్లలను చూస్తే వెంటనే అమూల్ బేబీలా ఉన్నావు అంటుంటాం. అంతలా అమూల్ బ్రాండ్ జనాల్లోకి చొచ్చుకెళ్లింది. గుజరాత్‌కు చెందిన కంపెనీ అయినా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ కంపెనీ పాల ఉత్పత్తులకు మంచి పేరుంది. ఈ పేరునే ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రధాని మోదీ సర్కారు పావులు కదుపుతోంది.
అమూల్ బ్రాండ్ మాతృసంస్థ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF)ని ప్రస్తుతం ఉన్న ఎనిమిదో స్థానం నుంచి ప్రపంచంలోనే నంబర్ వన్ డెయిరీ కంపెనీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నిర్దేశించారు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 'అమూల్' బ్రాండ్ ద్వారా తమ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న GCMMF స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు.

ప్రపంచ డెయిరీ రంగం ఏటా 2 శాతం అభివృద్ధి చెందుతుండగా, భారత్ మాత్రం అందుకు భిన్నంగా 6 శాతంతో విజయబావుటా ఎగరవేస్తోందన్నారు. GCMMFని ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. ఇందుకు తాను హామీ ఇస్తున్నట్లు చెప్పారు.
ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది సహకార డెయిరీ యూనియన్ సభ్యులు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక బ్రాండ్లు బయటకు వచ్చాయి కానీ వాటిలో ఏదీ 'అమూల్'తో సమానం కాదన్నారు. దేశంలోని డెయిరీ సహకారం అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ప్రశంసించారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications