RBI News: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుత మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఆర్‌బిఐ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు.
ఏప్రిల్ 1, 2024న భారతీయ రిజర్వు బ్యాంక్ తన 90వ ఏటలోకి అడుగుపెట్టింది. నారిమన్ పాయింట్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్(NCPA)లో గత 90 ఏళ్లుగా ఆర్‌బిఐ ప్రయాణం కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని మోదీ ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన మోదీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు చారిత్రక మైలురాయిని చేరుకుందని అన్నారు. ఆర్‌బిఐ 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆర్‌బిఐ ఒక సంస్థగా స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తర్వాత కాలాన్ని చూసింది.

తన నిబద్దత, వృత్తి నైపుణ్యంతో రిజర్వు బ్యాంక్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేటి రిజర్వు బ్యాంక్ స్థాపించి 90 ఏళ్లు పూర్తయిందని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం ఆర్‌బిఐతో అనుబంధం ఉన్నవారిని నేను చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నానని మోదీ తెలిపారు. ఈ రోజు ఆర్బీఐ చేస్తున్న విధానాలు, పని రాబోయే దశాబ్దంలో RBI దిశను నిర్దేశిస్తుందని తెలిపారు. తాను 2014లో ఆర్‌బీఐ '80వ' ఈవెంట్‌కి వచ్చినప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని మోదీ పేర్కొన్నారు.
దేశంలోని మొత్తం బ్యాంకింగ్ రంగం సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటోంది. NPAలకు సంబంధించి భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం, భవిష్యత్తు గురించి అందరూ భయపడ్డారని మోదీ అన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయని చెప్పిన ప్రధాని.. నేడు భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత బలమైన, స్థిరమైన వ్యవస్థగా పరిగణించబడుతుందన్నారు. ఒకప్పుడు పతనం అంచున ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు లాభదాయకంగా మారింది. రుణాల మంజూరు రికార్డు వృద్ధిని సాధిస్తోంది.
సరైన నిర్ణయాలు, విధానాలతో సరైన ఫలితాలు తప్పక వస్తాయని ప్రధాని చెప్పారు. ఈ క్రమంలో రాబోయే పదేళ్లలో డిజిటల్ లావాదేవీలు పెరగాలన్న ప్రధాని.. ఇదే సమయంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వల్ల వస్తున్న పరిణామాలపై నిఘా ఉంచాలని మోదీ సూచించారు. దేశ వృద్ధికి ఆవశ్యకతను ఎత్తిచూపిన ప్రధాని మోదీ, ఆర్‌బిఐ చురుకైన చర్యలు తీసుకోవాలని అన్నారు.


Click it and Unblock the Notifications