PM Modi: దేశంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఇలాంటి వాతావరణంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు పెద్ద శుభవార్త చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో 'మోదీ కి గ్యారెంటీ సంకల్ప్ పత్ర 2024'ని విడుదల చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిని విస్తరించాలని చూస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో 'మోదీ కి గ్యారెంటీ సంకల్ప్ పత్ర 2024'ని విడుదల చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దీనికింద దేశంలో 70 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్‌ను ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పరిధిలోకి తీసుకువస్తామని ప్రధాన మంత్రి చెప్పారు. ట్రాన్స్‌జెండర్లు కూడా దీని ప్రయోజనం పొందుతారని ప్రకటించారు.

స్కీమ్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పేదమధ్య లేదా అప్పర్ మిడిల్ క్లాస్‌కు చెందిన 70 ఏళ్లు దాటిన వృద్దులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. దీనికి ముందు దేశంలోని పేద ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018లో మోదీ సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికింద ప్రతి ఏడాది లబ్ధిదారులు రూ.5 లక్షల వరకు వైద్య చికిత్స అందుకుంటారు. దీనికింద ఏకంగా దేశంలో 34 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు అందించబడ్డాయి.
గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లోనే 16.7 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు తయారు చేయబడ్డాయి. చివరి 30 రోజుల్లో 60,00,404 కార్డులు తయారు చేయబడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ కార్డుకు అత్యధిక డిమాండ్ ఉంది. ఈ రాష్ట్రంలో 5 కోట్లకు పైగా కార్డులు అందించబడ్డాయి. మోదీ ప్రసంగంలో.. తాను అధికారంలోకి వస్తే వికలాంగులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. దీని ద్వారా వికలాంగులకు వారి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వసతి కల్పించడంపై దృష్టి సారించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు.


Click it and Unblock the Notifications