5G Launch: 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. డిజిటల్ యుగంలో భారత్ ముందుకెళ్తోందంటూ..
5G Launch: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు దేశంలో 5జీ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. దేశ టెలికాం రంగంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ల 5జీ సేవలను తొలిదశగా 13 మెట్రో నగరాల్లో ప్రారంభిస్తున్నాయి.

2023 చివరికి..
డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా వేగవంతమైన 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీలు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. 5G నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే మీరు ఇప్పటికే ఉన్న 4G LTE కంటే కనీసం 10 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని పొందుతుందని కంపెనాలు చెబుతున్నాయి. సుమారు రెండు గంటల నిడివి ఉండే సినిమాను కేవలం 7 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూపీఐ చెల్లింపులు..
టెలికాం సేవలు విస్తరించటం వల్ల దేశంలో మూలమూలలకు టెలీమెడిసిన్ ద్వారా ప్రజలకు చికిత్స అందుతోందని ప్రధాని మోదీ అన్నారు. చిన్న వీధి వ్యాపారులు సైతం యూపీఐ చెల్లింపులను అంగీకరిస్తున్నారని అభినందించారు. ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తే, ప్రజల ఉద్దేశాలను మార్చడానికి ఎక్కువ సమయం పట్టదని అన్నారు. టెలికాం రంగంలో ఈ రోజు కనిపిస్తున్న విప్లవానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. విద్య నాణ్యతను ఇది పెంచుతుందని అన్నారు.

అడ్డంకులను తొలగిస్తాం..
దేశంలోని ప్రజలందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని, దీనికి ఉన్న అడ్డంకులను తమ ప్రభుత్వం తొలగిస్తుందని చెప్పారు. మెుబైల్ తయారీలో భారత్ రెండవ స్థానంలో ఉన్నందున దేశంలో వాటి ధరలు తగ్గాయని పేర్కొన్నారు. 2014లో 60 మిలియన్లుగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 80 కోట్లకు దాటిందని తెలిపారు. ఆప్టికల్ ఫైబర్ లక్షా 70 వేలకు పైగా పంచాయతీలకు కనెక్ట్ చేయబడిందని అన్నారు.
ముకేష్ అంబానీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ 5జీ గురించి ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ ఉన్న 3డీ గ్రాసెస్ సైతం వేసుకుని వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ ప్రధానితో పాటు పాల్గొన్నారు. దీనిపై స్పందించిన ముకేష్ అంబానీ దేశ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందని అన్నారు. తమకు డిజిటల్ విజన్ ఇచ్చి ప్రోత్సహించిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
కుమార మంగళం బిర్లా..
వొడఫోన్ ఐడియా సైతం కొత్త సాంకేతకతను ప్రజలకు చేరువ చేసేందుకు పూర్తి స్థాయిలో కృషిచేస్తున్నట్లు బిర్లా గ్రూప్ ఛైర్మన్ వెల్లడించారు. 5జీ సేవల ప్రారంభంతో కంపెనీ పనితీరు మారుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications