PM Modi: సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. విశేషాలివే..

Surat Diamond Bourse: అంతర్జాతీయ వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధునిక కేంద్రమైన సూరత్ డైమండ్ బోర్స్‌(SDB)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు.

సూరత్ డైమండ్ బోర్స్ భవనం ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ సముదాయంగా నిర్మించబడింది. దీనిని దాదాపు 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో సూరత్ నగరానికి సమీపంలోని ఖాజోద్ గ్రామంలో అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ముడి, పాలిష్డ్ వజ్రాలతో పాటు జ్యూవెలరీకి కూడా ప్రపంచ ట్రేడింగ్ కేంద్రంగా ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా దాదాపు 1.5 లక్షల మందికి కొత్త ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అంచనా వేయబడింది.

PM Modi inauguration Surat Diamond Bourse buildings at dream city with world class facilities

ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ 'కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్' దిగుమతి, ఎగుమతి కోసం, రిటైల్ జ్యువెలరీ వ్యాపారం కోసం ఆభరణాల మాల్. పైగా ఇక్కడ అంతర్జాతీయ బ్యాంకింగ్, సురక్షితమైన వాల్ట్‌ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురాబడ్డాయి. గతంలో ముంబైలో ఉన్న వారితో సహా పలువురు వజ్రాల వ్యాపారులు ఇప్పటికే తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే వేలం తర్వాత వ్యాపారులకు యాజమాన్యం కేటాయించిందని SDB మీడియా కన్వీనర్ దినేష్ నవాదియా ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు.

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఫిబ్రవరి 2015లో SDB, డ్రీమ్ సిటీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజా మహా నిర్మాణం సైతం డ్రీమ్ సిటీలో భాగంగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం దాదాపు 4,500 డైమండ్ ట్రేడింగ్ ఆఫీసులు ఉండటంతో ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా అవతరించింది. డ్రీమ్ సిటీ లోపల 35.54 ఎకరాల ప్లాట్‌లో నిర్మించిన ఈ మెగా నిర్మాణంలో 15 అంతస్తుల తొమ్మిది టవర్లు 300 చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+