Gift City: భారతదేశంలో విక్రయించే బంగారం ధర ఇకపై మన దేశంలోనే నిర్ణయించబడుతుంది. ఇందుకోసం ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ (IIBX) ప్రారంభమైంది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో నిర్శించిన గిఫ్ట్ సిటీలో ప్రారంభించారు.

ఇతర దేశాల్లో మాదిరిగానే..
చైనాలోని.. షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్, టర్కీలోని.. బోర్సా గోల్డ్ ఎక్స్ఛేంజ్ తరహాలో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో భారత్ బులియన్ ఫ్లోస్‌కు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించనుంది. బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ప్రస్తుతం.. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ప్రకారం.. మన దేశంలో బంగారం ధర ప్రతి రోజూ నిర్ణయించబడుతోంది. ఆ రేట్ల ప్రకారమే దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.

సులభం కానున్న బంగారం దిగుమతి..
భౌతిక బంగారం, వెండి గుజరాత్‌లోని గాంధీనగర్ సమీపంలో ఉన్న ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్‌లో విక్రయించబడుతుంది. దేశంలో ఈ మార్పిడిని ప్రవేశపెట్టిన తర్వాత.. అంతర్జాతీయ స్పెక్యులేటర్ల కారణంగా, భారతీయ మార్కెట్‌లో బంగారం రేటు పెరగడం లేదా తగ్గడం లేదు. భారత్‌లోకి దిగుమతి చేసుకునే బంగారానికి ఈ ఎక్స్ఛేంజ్ గేట్‌వేగా పనిచేస్తుంది. బంగారు ఆభరణాలు, ఎగుమతిదారులు కొనుగోలు చేయడానికి ఇకపై లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ధర కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

గోల్డ్ రేటు తక్కువగా ఉంటుంది..
ఇంతకు ముందు వరకు బంగారం ఎగుమతిదారులు, పెద్ద వ్యాపారులు ప్రస్తుతం బంగారాన్ని నేరుగా దిగుమతి చేసుకోలేరు. దీని కోసం వారు బ్యాంకు లేదా ఏజెన్సీ సహాయం తీసుకోవాలి. బంగారం దిగుమతి, ఎగుమతి చేసే వ్యక్తుల నుంచి బ్యాంకు రుసుము వసూలు చేస్తుంది. దేశంలో ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ ప్రవేశపెట్టడంతో.. ఇకపై అటువంటి ఛార్జీలు విధించబడవు. IIBXలో రిజిస్టరైన జ్యువెలర్లు నేరుగా విక్రేత నుంచి బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు. దీనికారణంగా బంగారం ధర ఇంతకుముందు కంటే తగ్గుతుంది. ఇది ప్రజలకు ప్రయోజనకరమని చెప్పుకోవాలి.

డాలర్లలో సెటిల్మెంట్..
ప్రారంభంలో.. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్‌లో T+0 సెటిల్‌మెంట్‌తో ట్రేడింగ్ జురుగుతుంది. ఒక కిలో 995 స్వచ్ఛత,100 గ్రాముల బంగారం 999 స్వచ్ఛతతో ట్రేడింగ్ చేయవచ్చు. ఈ ట్రేడింగ్ లో అన్ని ఒప్పందాలు డాలర్లలో జాబితా చేయబడినందున సెటిల్మెంట్ కూడా డాలర్లలోనే ఉంటుంది.

జ్యూవెలర్స్ కు బ్యాంకుల సౌకర్యం..
రిజిస్టర్డ్ జ్యువెలర్స్‌కు ఎక్స్ఛేంజ్ ద్వారా బంగారం దిగుమతి చేసుకోవడానికి బ్యాంకులు 11 రోజుల అడ్వాన్స్ చెల్లింపు సౌకర్యాన్ని కల్పిస్తాయి. భారతదేశం 2021లో 1,069 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది ఏడాది క్రితం 430 టన్నులుగా ఉంది.

నిల్వ కోసం మౌలిక సదుపాయాలు..
1990ల లిబరలైజేషన్ ప్రవేశపెట్టిన తరువాత దేశంలో మొదటిసారిగా IIBX ద్వారా బంగారం దిగుమతికి అనుమతించబడింది. బంగారం, వెండి నిల్వ కోసం గాంధీనగర్‌లోని ఎక్స్ఛేంజ్‌లో మౌలిక సదుపాయాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. దీని ప్రకారం.. బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ట్రేడింగ్ సభ్యుడు ట్రేడింగ్ భాగస్వామి లేదా క్లయింట్‌గా ఉంటే సరిపోతుంది. రానున్న కాలంలో ఈ సదుపాయం బంగారం ధరల స్థిరీకరణకు దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

బంగారం ధరలపై దిమ్మతిరిగే న్యూస్.. పసిడి ధర భారీగా పెరగడానికి ఈ మూడే కారణం.. భవిష్యత్తులో కూడా..

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..

బంగారం కొనాలా..వెండి కొనాలా.. ఇరాన్ యుద్ధంతో ఇన్వెస్టర్లు ఆందోళన..నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారాన్ని భారీగా కొంటున్న బ్యాంకులు.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులన్నీ అమ్మేసి మరీ.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications