Yashobhoomi: మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్కీమ్ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం. 13 వేల కోట్లు ఇందుకోసం వెచ్చించేందుకు మంత్రివర్గం సైతం గతంలో ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రెండు కొత్త ప్రారంభాలు చేసిన ప్రధాని.. సినిమా, టెలివిజన్ తో పాటు గ్లోబల్ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలకు ఆహ్వానం పలికారు.
అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్ భారత్ మండపంతో పాటు నూతనంగా నిర్మించిన యశోభూమిని ప్రధాని మోదీ ప్రారంభించారు. 5 వేల 400 కోట్లను ఇందుకోసం వెచ్చించారు. ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్ ఫేజ్-1లో భాగంగా.. 1.8 లక్షల చదరపు మీటర్ల ఏరియాలో దీన్ని నిర్మించారు. ప్రపంచంలోని అతిపెద్ద MICE(సభలు, ప్రోత్సాహకాు, సమావేశాలు, ప్రదర్శనలు) సౌకర్యాలు కలిగిన వాటిలో ఇదొకటి.

ఈ సందర్బంగా కాన్ఫరెన్స్ టూరిజం భవిష్యత్తు గురించి మోదీ మాట్లాడారు. 25 వేల కోట్లకు పైగా విలువైన అపార అవకాశాలు ఈ రంగంలో ఉన్నట్లు చెప్పారు. ఈవెంట్స్, సమావేశాలు, ఎగ్జిబిషన్లకు అనువుగా భారత్ మండపం, యశోభూమి సెంటర్ నిర్మించి.. ఢిల్లీని కాన్ఫరెన్స్ టూరిజంలో అతిపెద్ద హబ్‌గా మార్చనున్నట్లు తెలిపారు. తద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
'అవార్డు వేడుకలు, ఫిల్మ్ ఫెస్టివల్స్, సినిమా ప్రదర్శనలను ఇక్కడ నిర్వహించేందుకు ఆహ్వానం పలుకుతున్నాను. అంతర్జాతీయ ఈవెంట్ కంపెనీలు, ఎగ్జిబిషన్ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు భారత్ మండపం, యశోభూమిలో ఈవెంట్ నిర్వహణకు ముందుకు రావాలని కోరుతున్నాను' అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications