Aero India 2023: బెంగళూరులో ఏరో ఇండియా- 2023 కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి కూడా పాల్గొన్నారు. ఎయిర్ షో భారత శక్తికి నిదర్శనమని మోదీ వెల్లడించారు. సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.ఇది భారత శక్తికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారత్ అతిపెద్ద భాగస్వామని వ్యాఖ్యానించారు.
ఆసియాలో అతిపెద్ద ఎయిర్ షో 14వ ఎడిషన్ నేడు బెంగళూరులో ప్రారంభం అయింది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రామానికి యలంకా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కేంద్రంగా మారింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో కార్యక్రమం కావటం భారత్ కు గర్వకారణం. ఇందులో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, ఎక్విప్ మెంట్, కొత్త తరం ఏవియానిక్స్ ప్రదర్శనకు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలలకు చెందిన దాదాపు 809 కంపెనీలు పాల్గొంటున్నాయి.

ఈ క్రమంలో భారత్ మంచి డీల్స్ చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. LCA Tejas Mk 1A ఫైటర్లను అర్జెంటీనా, మలేషియాలకు విక్రయించి మంచి డీల్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తొలిసారిగా తన తరువాతి తరం సూపర్ సోనిక్ ట్రైనర్ HLFT-42ను ప్రదర్శనలో ఉంచుతోందని తెలుస్తోంది.

విస్తరిస్తున్న భారత సామర్థ్యాలకు ఏరో ఇండియా కార్యక్రమం పెద్ద ఉదాహరణని ప్రధాని మోదీ అన్నారు. నవ భారత సామర్థ్యానికి బెంగళూరు ఆకాశం సాక్షిగా మారుతోందని ఏరో ఇండియా షోని కొనియాడారు. ఇందులో దాదాపు 100కుపైగా దేశాలు పొల్గొనటం వల్ల భారత్‌పై ప్రపంచానికి నమ్మకం పెరిగిందని చెప్పవచ్చని అన్నారు. ఇందులో ఇండియాతో పాటు ప్రపంచదేశాలకు చందిన 700 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏరో షో-2023 గత రికార్డులను బద్దలకొట్టిందని మోదీ తెలిపారు.



Click it and Unblock the Notifications