Unified Pension Scheme: దేశంలో చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంపై అనేక వివాధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ బీజేపీ పానలో లేని అనేక రాష్ట్రాలు పాత పెన్షన్ సిస్షమ్ కావాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇది డీఏ రేటుకు అనుసంధానించబడి ఉంటుంది. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత చివరిగా పొందిన వేతనంలో సగం పెన్షన్ రూపంలో అందించబడుతుంది. అయితే జనవరి 1, 2004న లేదా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో చేరిన సాయుధ దళాలలో ఉన్నవారు మినహా అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ అమలులోకి వచ్చింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీనిలో ఉండే ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. కనీసం 25 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణకు ముందు గత 12 నెలలలో వారి సగటు ప్రాథమిక వేతనంలో 50 శాతం వరకు హామీ ఇవ్వబడిన పెన్షన్‌ను అందుకుంటారు. 25 ఏళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్నవారికి, పెన్షన్ వారి పదవీ కాలానికి అనుగుణంగా ఉంటుంది. అయితే పెన్షన్ పొందటానికి కనీస అర్హత సర్వీసును 10 ఏళ్లుగా నిర్ణయించారు. అలాగే అనుకోకుండా ఉద్యోగి మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామి కుటుంబ పెన్షన్‌ను అందుకుంటారు. ఆ ఉద్యోగి మరణానికి ముందు డ్రా చేస్తున్న పెన్షన్‌లో 60% హామీ ఇవ్వబడుతుంది.

ఇక కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వ్యక్తులకు నెలకు పెన్షన్ రూ.10,000 హామీ ఇవ్వబడింది. ఇక్కడ హామీ ఇవ్వబడిన పెన్షన్, కుటుంబ పెన్షన్ రెండూ ద్రవ్యోల్బణ సూచికకు లోబడి ఉంటాయి. ఉద్యోగులకు సేవలందిస్తున్నట్లే, యూనిఫైడ్ పెన్షన్ కింద పదవీ విరమణ పొందినవారు పారిశ్రామిక కార్మికులకు ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా డియర్నెస్ రిలీఫ్ ఉంటుంది. గ్రాట్యుటీతో పాటుగా, ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో ఒకేసారి మొత్తం చెల్లింపును అందుకుంటారు.
యూనిఫైడ్ పెన్షన్ విధానం తక్షణమే 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ది చేకూర్చనుంది. ఒకవేళ రాష్ట్రప్రభుత్వాలు కూడా ఇందులో చేరితే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షలకు పెరుగుతుందని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రాజకీయ లాభాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ పెన్షన్ విధానాన్ని ప్రకటించింది. దీనికి ముందు కాంగ్రెస్ పాత పెన్షన్ విధానాన్ని దేశంలో తాము అధికారంలోకి రాగానే అందిస్థామని చెప్పిన సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెన్షన్ మార్పులతో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం ప్రారంభించింది.


Click it and Unblock the Notifications