June 4th Stock Markets: గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులు ఈసారి ఎన్నికల వేళ స్టాక్ మార్కెట్లపై కామెంట్స్ చేస్తున్నారు. మెున్న వారంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా స్టాక్ మార్కెట్లలో ఆందోళనలపై స్పందించారు. విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్లను వీడుతున్న వేళ వారి వ్యాఖ్యలు వచ్చాయి.
ఎన్నికల ఫలితాలపై దేశీయ స్టాక్ మార్కెట్లలోని విశ్లేషకులు గందరగోళంలో ఉన్నప్పటికీ.. దలాల్ స్ట్రీట్‌లోని ఒడిదొడుకులను ప్రధాని మోదీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోదీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలైన తర్వాత స్టాక్ మార్కెట్లు ఎటువైపు మళ్లుతాయనే అంశంపై తన అంచనాలను వెల్లడించారు. దీనికి ముందు ఇతర మంత్రులు సైతం దీనిపై తమ స్పందనలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

నేడు దేశవ్యాప్తంగా 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు తమ పాత రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తాయని మోదీ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన ఒక వారం తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలను తాకుతుందని పేర్కొన్నారు. ఈ భారీ తాకిడితో స్టాక్ మార్కెట్ ప్రోగ్రామర్లు అలసిపోతారని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వ గరిష్ఠంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టిందని, ఎంట్రప్రెన్యూర్‌షిప్ విధానం మన ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. దశాబ్ధకాల పాలనలో మార్కెట్లు 25,000 స్థాయి నుంచి 75,000 స్థాయికి చేరుకున్నాయని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ క్రమంలో సాధారణ పౌరులు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎంత పెట్టుబడులు పెడితే ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని అన్నారు. ఈ క్రమంలో పౌరుల్లో రిస్క్ అపటైట్ పెరగాలని మోదీ సూచించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల పనితీరుపై హెచ్‌ఏఎల్‌ను ఉదాహరణగా చూపుతూ.. హెచ్‌ఏఎల్ రూ.4,000 కోట్లకు పైగా లాభాలను ఆర్జించిందని చెప్పారు. గతంలో ప్రభుత్వ కంపెనీల షేర్లు పడిపోయేవని.. కానీ నేడు స్టాక్ మార్కెట్‌లో వాటి విలువ చాలా రెట్లు పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే అందరి దృష్టి జూలై బడ్జెట్ పైనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గ్రామీణ భారతదేశం నుంచి డిమాండ్‌ను పెంచడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయ చట్టాలు, నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగంలో ఉద్యోగాల కల్పనపై దీర్ఘకాలికంగా తమ దృష్టి ఉంటుందని క్యాపిటల్ మార్కెట్లు తెలిపాయి. ఇదే క్రమంలో బీజేపీ తృత్వంలోని ఎన్‌డీఎ 400 కంటే ఎక్కువ స్థానాలను సాధిస్తే మార్కెట్లు బలమైన ర్యాలీని చూస్తామని గత వారం ఫిలిప్ క్యాపిటల్ పేర్కొంది. అలాగే ఎన్డీయేకు 300 నుంచి 330 సీట్ల కంటే తక్కువ వచ్చి మార్కెట్ పడిపోతే దానిని కొనుగోలుకు అవకాశంగా పరిగణిస్తామని వెల్లడించింది.


Click it and Unblock the Notifications