GIFT city: అగ్రరాజ్యాలు సైతం అందుకోలేని ఫీట్ ని సాధిస్తూ భారత్ వృద్ధి పథంలో తారాజువ్వలా ముందుకు వెళుతోంది. ప్రపంచ దేశాలు చతికిలపడినా ఇండియా మాత్రం తన హవా కొనసాగిస్తూనే ఉంది. కరోనా అనంతరం అంతర్జాతీయ సమాజం ఆర్థిక అనిశ్చితిలో చిక్కుకోగా.. మన దేశం GDPని మెరుగుపరుచుకుంటూ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అడుగులు వేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే భారత GDP వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదు అయింది. ఈ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి గత పదేళ్లలో చేపట్టిన సంస్కరణలే కారణమని ప్రధాని మోదీ తెలిపారు. వాటి పర్యవసానంగానే వివిధ దేశాలు అందుకోలేని వృద్ధిరేటును భారత్ సునాయాసంగా చేరుకోగలిగిందన్నారు. గిఫ్ట్ సిటీ లో జరిగిన 'ఇన్ఫినిటీ ఫోరం 2.0' సదస్సులో వీడియో లింక్ ద్వారా ఆయన ఈమేరకు ప్రసంగించారు.

గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (GIFT) సిటీని ఆధునిక యుగపు ప్రపంచ ఆర్థిక మరియు సాంకేతిక సేవల కేంద్రంగా మార్చాలని తాము భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. అంతర్జాతీయ సమాజం చూపు దేశంపై ఉందని, ఆయా దేశాలు భారత్ పైనే ఆశలు పెట్టుకున్నాయన్నారు. ఇది కేవలం తనంతట తానుగా జరగలేదని, వివిధ పరివర్తనాత్మక మార్పుల ఫలితమే అన్నారు.
ప్రపంచంలోనే భారత్ నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్ టెక్ మార్కెట్లో ఒకటని ప్రధాని గుర్తు చేశారు. ఇదే సమయంలో గిఫ్ట్ సిటీ కేంద్రంగా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రీన్ క్రెడిట్స్ కోసం మార్కెట్ మెకానిజంను డెవలప్ చేయడంపై తమ ఆలోచనలు పంచుకోవాలని నిపుణులను కోరారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications