గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తాము సరిదిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం అన్నారు. ఆయన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(CII) వార్షిక సదస్సు-2021లో మాట్లాడారు. ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు పాల్గొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటోందన్నారు. దేశం కోసం తమ ప్రభుత్వం ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం ప్రవేశపెడుతున్న సంస్కరణలు అన్ని కూడా నమ్మకం నుండి వచ్చినవి తప్ప, బలవంతం కాదని నొక్కి చెప్పారు. తమ ప్రభుత్వం ఇండస్ట్రీకి అండగా ఉంటుందని, అదే సమయంలో స్వావలంభన భారత్ ప్రచార విజయం భారీ బాధ్యత వారి పైన ఉందన్నారు.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తాము సరిదిద్దామన్నారు. రెట్రోస్పెక్టివ్ అంటే పాత తేదీల నుండి వేసే పన్నును ఉద్దేశించి ఆయన పై వ్యాఖ్యలు చేశారు. రెట్రోస్పెక్టివ్ రద్దు ద్వారా ప్రభుత్వంపై పరిశ్రమ వర్గాలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో పరిశ్రమల పాత్ర ఎనలేనిది అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారి సహకారంతో మళ్లీ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సహకారం పెరిగిందని తెలిపారు. కరోనా సమయంలో మాస్కులు, పీపీఈ కిట్స్, కొవిడ్ వ్యాక్సీన్స్‌ను పరిశ్రమ వర్గాలు అందించాయని గుర్తు చేసుకున్నారు. ఏడెనిమిదేళ్ల క్రితం కేవలం మూడూ నుండి నాలుగు మాత్రమే యూనికార్న్ కంపెనీలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 60కి చేరుకుందన్నారు. వాటిలో 21 కంపెనీలు కేవలం గత కొన్ని నెలల్లో ఆవిర్భవించావన్నారు.

తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల దేశంలోకి ఎఫ్‌డీఐలు రికార్డు స్థాయిలో వస్తున్నాయన్నారు. ఎఫ్‌పీఐలు, ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయన్నారు. దేశంలోని ప్రజలు కూడా మేడిన్ ఇండియా వస్తువులు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. కరోనా సమయంలో సంస్కరణలు అమలు చేశామన్నారు. పరిశ్రమ వర్గాలకు తమ అండ ఉంటుందన్నారు. పరిశ్రమలకు ఎదురయ్యే అవరోధాలను తొలగించేందుకు తమ ప్రభుత్వం ముందు ఉంటుందని భరోసా ఇచ్చారు. పెట్టుబడిదారులు కూడా పెట్టుబడులు పెట్టి కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నారు.
తాము ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని, చాలా సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. సంస్కరణలు కొనసాగుతాయన్నారు. కమర్షియల్ కోల్ మైనింగ్ ప్రారంభమైందన్నారు. డిఫెన్స్ సెక్టార్‌లో పలు కొత్త సంస్కరణలు తీసుకు వచ్చినట్లు తెలిపారు. స్పేస్ అండ్ ఆటామిక్ సెక్టార్‌లలో ప్రయివేటుకు బాటలు వేశామన్నారు. గత కొన్నేళ్లుగా తమ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు అందరూ సాక్షులే అన్నారు. చాలా ఏళ్ల తర్వాత జీఎస్టీని తీసుకు వచ్చామన్నారు. జీఎస్టీని అమలులోకి తీసుకు రావడమే కాకుండా, ఇప్పుడు రికార్డ్ కలెక్షన్లు నమోదవుతున్నాయన్నారు.
ఇటీవలి కాలంలో ఐటీ రంగంలో రికార్డ్ స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. డిజిటలైజేషన్, డిమాండ్ గ్రోత్‌కు ఇది నిదర్శనం అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మన సామర్థ్యాన్ని అవకాశాలుగా మలుచుకున్నామన్నారు. తద్వారా మన లక్ష్యం వైపు రెండింతల వేగంతో పయనిస్తున్నామన్నారు. 'సరికొత్త భారత దేశం సరికొత్త ప్రపంచంతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంది. ఈరోజు భారత దేశం వివిధ రంగాల్లోకిపెట్టుబడులను ఆహ్వానిస్తోంది' అన్నారు. మేకిన్ ఇండియా ప్రోత్సాహానికి పీల్ఐ స్కీంను ప్రారంభించామని చెప్పారు.


Click it and Unblock the Notifications