Free Ration Scheme: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. తక్కువ వడ్డీకి రుణాల నుంచి గ్యాస్ ధరల తగ్గింపు వరకు అనేక తగ్గింపులు ఇప్పటికే అందించింది.
రానున్న ఐదేళ్ల కాలంలో దేశంలో ప్రజలకు అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని దాదాపు 80 కోట్ల మంది భారతీయులకు చేరువచేస్తానని ప్రధాని మోదీ ఛత్తీస్గడ్ ర్యాలీలో ప్రకటించారు. అయితే దీని అమలుకు రానున్న కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవలి క్యాబినెట్ నిర్ణయాన్ని "దేశంలోని వెనుకబడిన వర్గాల ప్రజలకు నూతన సంవత్సర బహుమతి"గా ప్రభుత్వ అధికారులు అభివర్ణించారు.

ఇందుకోసం ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం కింద ప్రధాన్యతా గృహాలు, అంటోదయ అన్న యోజన కుటుంబాలకు ముతక బియ్యం, గోధుమలు, ఇతర తృణధాన్యాలు సబ్సిడీ ధరలకు కేంద్రం అందించనుంది. ఈ నిర్ణయం డిసెంబర్ 31, 2022న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) ముగిసేలోపు వచ్చింది. PMGKAY 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రవేశపెట్టబడింది. దీని కింద ప్రభుత్వం NFSA కోటాలో ఉన్న వ్యక్తులకు 5 కిలోగ్రాముల ఆహార ధాన్యాన్ని ఉచితంగా సరఫరా చేసింది. అయితే కేంద్రం ఇప్పుడు PMGKAY పథకాన్ని NFSAతో విలీనం చేసింది.
ప్రధాని మోదీ నిర్ణయం ప్రకారం 81.35 కోట్ల మందికి పైగా ప్రజలు ఇప్పుడు NFSA కింద కాంప్లిమెంటరీ ఆహారధాన్యాలను అందుకోనున్నారు. పైగా ఆహార ధాన్యాలను పొందేందుకు లబ్ధిదారులు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 75%, పట్టణ ప్రాంతాల్లో 50% గణనీయమైన సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాన్ని అందించేందుకు కేంద్రం జూలై 2013లో NFSAని ప్రవేశపెట్టింది. ఫేజ్ I నుంచి ఫేజ్ VII వరకు అన్ని దశలకు ఆహార సబ్సిడీలు, కేంద్ర సహాయం కోసం మొత్తం మంజూరైన బడ్జెట్ దాదాపు 3.91 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.


Click it and Unblock the Notifications