Modi: మోదీకి జైకొట్టిన ఇంటర్నేషనల్ సర్వే.. జో బైడెన్‌కు భంగపాటు.. కెనడా ప్రధానికి తీవ్ర పరాభవం
Popular Leader: ప్రపంచ దేశాల్లో భారత్ ఓ బ్రైట్ స్పాట్ గా వెలుగొందుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో మోదీ మ్యాజిక్ బాగా పనిచేస్తోంది. పలు ప్రముఖ సర్వేలు సైతం ఆయన మ్యానియాకు ఫిదా కాక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ మరోసారి చరిత్ర సృష్టించారు. అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' ఈ మేరకు వెల్లడించింది. 76 శాతం ఆమోద రేటుతో ఈ జాబితాలో మోదీ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. గత కొంతకాలంగా భారత PM ఈ లిస్టులో అగ్రస్థానాన్ని అధిరోహిస్తూ వస్తున్నారు. కాగా మరోసారి అదే రిపీట్ అయింది.

మోదీ అనంతరం మెక్సికో అధ్యక్షులు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్, స్విట్జర్లాండ్ అధ్యక్షులు అలైన్ బెర్సెట్, బ్రెజిల్ అధ్యక్షులు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. 40 శాతం ఆమోద రేటింగ్ తో అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ 7 స్థానంతో సరిపెట్టుకున్నారు. 76 శాతం మోదీ నాయకత్వాన్ని ఆమోదించగా.. 18 శాతం వ్యతిరేకించారు, మరో 6 శాతం తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి నిరాకరించారు.
ఈ జాబితాలోని మొదటి టాప్ 10 నాయకుల్లో కెనడాకు చెందిన జస్టిన్ ట్రూడో అత్యధిక అసమ్మతి రేటు కలిగి ఉన్నారు. 58 శాతం ఆయనపై వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేశారు. నవంబర్ 29-డిసెంబర్ 5 మధ్య సేకరించిన డేటా ప్రకారం తాజా రేటింగ్స్ ఇచ్చినట్లు సదరు సంస్థ ప్రకటించింది. 22 మంది ప్రపంచ నాయకులపై సర్వే ఆధారంగా ఈ డేటా రూపొందించినట్లు పేర్కొంది. ఇక తాజా రిపోర్టుతో ప్రధాని మోదీపై భాజపా నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications