For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Year Ender 2019: క్రికెట్ ప్రపంచకప్, చంద్రయాన్, ఆర్టికల్ 370, పీఎం కిసాన్: 2019 గూగుల్ టాప్ 10 ఇవే

|

2019 క్యాలెండర్ ఇయర్ మరో 18 రోజుల్లో ముగియనుంది. 2020 జనవరి 1కి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఈ ఏడాదిలో (2019) ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో చాలామందిని ఆకర్షించేవి కొన్ని ఉంటాయి. ఉదాహరణకు లోకసభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఆర్టికల్ 370, అయోధ్య అంశం సహా ఎన్నో అంశాలు ఉన్నాయి. మనం వార్తలు ప్రింటి, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా ద్వారా కూడా తెలుసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మన దేశంలో సెర్చింజన్ గూగుల్‌లో ఈ ఏడాది వెతికిన టాప్ 10 ఇవే...

20 ఏళ్ల క్రితం రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే.. 2 లక్షల రెట్లు

గూగుల్ సెర్చింజన్‌లో ఎక్కువగా వెతికిన టాప్ 10 అంశాలు..

గూగుల్ సెర్చింజన్‌లో ఎక్కువగా వెతికిన టాప్ 10 అంశాలు..

- క్రికెట్ వరల్డ్ కప్ Cricket World Cup

- లోకసభ ఎన్నికలు Lok Sabha Elections

- చంద్రయాన్ 2 Chandrayaan 2

- కబీర్ సింగ్ 'Kabir Singh'

- అవెంజర్స్:ఎండ్ గేమ్ 'Avengers: Endgame'

- ఆర్టికల్ 370 Article 370

- నీట్ ఫలితాలు NEET results

- జోకర్ 'Joker'

- కెప్టెన్ మార్వెల్ 'Captain Marvel'

- పీఎం కిసాన్ యోజన PM Kisan Yojana

క్రికెట్ ప్రపంచకప్

క్రికెట్ ప్రపంచకప్

మే 30 నుంచి జూలై 14వ తేదీ మధ్య జరిగిన క్రికెట్ వరల్డ్ కప్‌ను 2.6 బిలియన్ల మంది చూశారు. గూగుల్ సెర్చ్‌లో ఇది అగ్రస్థానంలో ఉంది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ వెనుదిరిగినప్పటికీ అత్యధికులు క్రికెట్ ప్రపంచ కప్ కోసం వెతికారు. టాప్ 10లో ఇది మొదటి స్థానంలో నిలిచింది.

లోకసభ ఎన్నికలు

లోకసభ ఎన్నికలు

2019 ఏప్రిల్ - మధ్య జరిగిన లోకసభ ఎన్నికలను కూడా ఎక్కువమంది వెతికారు. ఇది రెండో స్థానంలో నిలిచింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014 కంటే అద్భుత విజయం సాధించింది. పథకాల పేరుతో అధికారంలోకి వస్తుంటారని, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం జీఎస్టీ, నోట్ల రద్దు వంటి కఠిన నిర్ణయాలు తీసుకొని తిరిగి అధికారంలోకి వచ్చిందనే వాదనలు ఉన్నాయి.

చంద్రయాన్ 2

చంద్రయాన్ 2

భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చంద్రయాన్ 2. ఈ ప్రాజెక్టు విఫలమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇస్రో మన్ననలు అందుకుంది. ఈ ప్రయోగంలో ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల ముందు విక్రమ్ ల్యాండర్‌లో తలెత్తిన లోపం కారణంగా కమ్యూనికేషన్ కోల్పోయింది. ఈ ప్రయోగం సమయంలో ప్రధాని మోడీ ఇస్రో కంట్రోల్ సెంటర్‌లో ఉన్నారు. ఇస్రో చీఫ్ శివన్‌కు ప్రధాని ఓదార్పు అందరినీ కదిలించింది.

కబీర్ సింగ్

కబీర్ సింగ్

షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ చిత్రం కబీర్సింగ్. గూగుల్ సెర్చ్‌లో ఇది నాలుగో స్థానం దక్కించుకుంది. తెలుగులో విజయ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డికి ఇది రీమేక్.

అవెంజర్స్:ఎండ్ గేమ్

అవెంజర్స్:ఎండ్ గేమ్

హాలీవుడ్ చిత్రాలకు భారత్‌లోను మంచి ఆదరణ ఉంటుంది. అవేంజర్స్ సిరీస్‌లో వచ్చిన అవెంజర్స్:ఎండ్ గేమ్ గూగుల్ సెర్చింజన్‌లో ఐదో స్థానంలో నిలిచింది. మార్వెల్ సంస్థ దీనిని రూపొందించింది.

ఆర్టికల్ 370

ఆర్టికల్ 370

దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు ద్వారా మోడీ ప్రభుత్వం యావత్ భారతం మన్ననలు అందుకుంది. ఆగస్ట్ 5వ తేదీన ఈ ఆర్టికల్‌ను రద్దు చేశారు. రాజ్యసభలో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఇది చారిత్రక నిర్ణయం అన్నారు.

నీట్ ఫలితాలు

నీట్ ఫలితాలు

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఫలితాల కోసం కూడా ఎక్కువ మంది వెతికారు. ఇది ఏడో స్థానంలో నిలిచింది.

జోకర్

జోకర్

జోక్వీన్ ఫోనిక్స్ ప్రధాన పాత్రలో వచ్చిన హాలీవుడ్ చిత్రం జోకర్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

కెప్టెన్ మార్వెల్

కెప్టెన్ మార్వెల్

గూగుల్ జాబితాలో హాలీవుడ్ సినిమా కెప్టెన్ మార్వెల్ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

పీఎం కిసాన్ యోజన

పీఎం కిసాన్ యోజన

రైతులకు ఏడాదికి రూ.6వేలు పెట్టుబడి సాయం కింద అందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపట్టారు. దీనిని కూడా గూగుల్‌లో ఎక్కువ మంది వెతికారు. టాప్ 10 జాబితాలో దీనికి కూడా చోటు దక్కింది.

English summary

PM Kisan Yojana in Google's Year in Search 2019

In India the top trends included search for Cricket World Cup, which was followed by Lok Sabha Elections, Chandrayaan 2, Kabir Singh and Avengers: Endgame. In terms of personalities, people in the country Googled Wing Commander Abhinandan Varthaman, Lata Mangeshkar, Yuvraj Singh, Anand Kumar and Vicky Kaushal the most.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more