పీఎం కిసాన్ 23వ విడత విడుదల.. మీ అకౌంట్‌లో రూ. 2,000 పడకపోతే వెంటనే ఈ పనులు చేయండి!

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) 23వ విడత డబ్బులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ వేదికగా దేశంలోని దాదాపు 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఏకంగా రూ.18,880 కోట్లకు పైగా నిధులను బటన్ నొక్కి నేరుగా జమ చేశారు.

అయితే, ఇంతమందికి డబ్బులు పడినా.. కొంతమంది అర్హులైన రైతులకు మాత్రం ఇంకా రూ. 2,000 అకౌంట్లోకి రాలేదు. ఒకవేళ మీకు కూడా ఈ విడత డబ్బులు అందకపోతే అస్సలు కంగారు పడకండి. మీ డబ్బులు ఎందుకు ఆగాయి? మళ్లీ ఎలా పొందాలో ఇప్పుడు చాలా ఈజీగా తెలుసుకుందాం.

PM Kisan 23rd installment updates check balance and status details

మీ రూ. 2,000 ఆగిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఇవే!

చాలాసార్లు అర్హత ఉన్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల డబ్బులు అకౌంట్‌లో పడవు. మీ అకౌంట్ లోకి అమౌంట్ రాకపోతే వెంటనే ఈ విషయాలను ఒకసారి చెక్ చేసుకోండి..

  • ఇన్-యాక్టివ్ బ్యాంక్ అకౌంట్: మీ బ్యాంక్ ఖాతా రన్నింగ్‌లో ఉందో లేదో చూసుకోండి. ఖాతా వివరాలు తప్పుగా ఉన్నా లేదా అకౌంట్ లాక్ అయినా డబ్బులు క్రెడిట్ కావు.
  • e-KYC తప్పనిసరి: పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ ఇ-కేవైసీ (e-KYC) చేయడం రూల్. ఇది పూర్తి చేయని వారి అకౌంట్లలో డబ్బులు జమ కావు. వెంటనే PM Kisan పోర్టల్‌లోకి వెళ్లి మీ స్టేటస్ చూసుకోండి.
  • వివరాల తప్పులు: మీ గుర్తింపు కార్డు (Identity Details) లో ఉన్న పేరు, పుట్టిన తేదీ.. బ్యాంక్ పాస్‌బుక్‌ లో ఉన్న వివరాలతో మ్యాచ్ కాకపోయినా పేమెంట్లు నిలిచిపోతాయి. ఏవైనా తేడాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి.

బెనిఫిషియరీ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చూసుకోండి!

కొన్నిసార్లు పత్రాల లోపాల వల్ల లబ్ధిదారుల జాబితా నుండి పేర్లు తొలగిపోతుంటాయి. కాబట్టి PM Kisan అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి "నో యువర్ స్టేటస్" (Know Your Status) అనే ఆప్షన్ ద్వారా మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో వెరిఫై చేసుకోండి. అక్కడ మీ డబ్బులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో కూడా క్లియర్ గా చూపిస్తుంది.

డబ్బులు రాకపోతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

మీ వివరాలన్నీ సరిగ్గా ఉండి, e-KYC కూడా పూర్తయినప్పటికీ మీ అకౌంట్‌ లోకి రూ. 2,000 రాకపోతే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యను చెప్పుకోవచ్చు. హెల్ప్ లైన్ నెంబర్ 155261, టోల్ ఫ్రీ నెంబర్ 1800-115-526.

చిన్న సలహా: ప్రభుత్వం ఒకేసారి కోట్లాది మంది రైతులకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. కాబట్టి బ్యాంక్ సర్వర్ల వల్ల అందరి అకౌంట్లలో రిఫ్లెక్ట్ అవ్వడానికి కొన్ని గంటల నుండి రెండు మూడు రోజుల సమయం పట్టవచ్చు. అందువల్ల ఆందోళన పడకుండా కాస్త ఓపికగా ఎదురుచూడటం మంచిది!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+