PM KISAN : ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత? మీ ఖాతాలో డబ్బులు పడాలంటే ఇది తప్పనిసరి!
భారతదేశంలో వ్యవసాయం అనేది వాతావరణం, మార్కెట్ ఒడిదుడుకులతో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM KISAN) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున మూడు విడతల్లో అందజేస్తారు. ఇప్పటివరకు 21 విడతలు విజయవంతంగా విడుదల కాగా.. ఇప్పుడు అందరి కళ్లు 22వ విడత నిధులపై ఉన్నాయి.

నిధులు ఎప్పుడు విడుదలవుతాయి?
నిబంధనల ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 రైతు ఖాతాలో జమ కావాలి. గతంలో 21వ విడతను నవంబర్ 2025లో విడుదల చేశారు. ఆ లెక్కన చూస్తే.. ఫిబ్రవరి 2026తో నాలుగు నెలల గడువు ముగుస్తుంది. అందువల్ల, ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు, మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అయితే వ్యవసాయ శాఖ నుండి ఇంకా ఖచ్చితమైన తేదీ వెలువడలేదు.
ఈ మూడు పనులు చేయకపోతే నిధులు రావు!
ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, మీ ఖాతాలోకి డబ్బులు రావాలంటే కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ ఇవి పూర్తికాకపోతే మీకు రావాల్సిన రూ. 2,000 ఆగిపోయే ప్రమాదం ఉంది..
- ఇ-కేవైసీ (e-KYC) అప్‌డేట్: పథకంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది. మీరు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ (pmkisan.gov.in) ద్వారా ఆధార్, ఓటీపీ సాయంతో ఇంట్లోనే దీన్ని పూర్తి చేయవచ్చు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే దగ్గరలోని సీఎస్‌సీ (CSC) సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా అప్‌డేట్ చేసుకోవాలి.
- ల్యాండ్ సీడింగ్ (Land Seeding): ప్రభుత్వ రికార్డుల ప్రకారం సాగు భూమి మీ పేరు మీద ఉంటేనే ఈ నిధులు అందుతాయి. మీ బెనిఫిషియరీ స్టేటస్‌లో 'Land Seeding: No' అని ఉంటే, వెంటనే స్థానిక రెవెన్యూ కార్యాలయం లేదా పట్వారీని సంప్రదించి భూమి వివరాలను నమోదు చేయించాలి.
- డిబిటి (DBT) యాక్టివేషన్: పీఎం కిసాన్ (PM KISAN) డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ అయి ఉండాలి , ఎన్‌పీసీఐ (NPCI) మ్యాపింగ్ పూర్తయి ఉండాలి. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మీ అకౌంట్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయించి డిబిటి ఫీచర్‌ను ఆన్ చేసుకోవాలి.
.. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోని 'Beneficiary Status' ఆప్షన్‌లోకి వెళ్లి మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేస్తే, పైన పేర్కొన్న మూడు పనులు (e-KYC, Land Seeding, Aadhaar Mapping) పూర్తయ్యాయో లేదో తెలుస్తుంది. అక్కడ అన్నింటికీ 'Yes' అని ఉంటే. మీకు 22వ విడత నిధులు అందడంలో ఎటువంటి ఆటంకం ఉండదు.


Click it and Unblock the Notifications