దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) 21వ విడత డబ్బులు త్వరలో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీని గురించిన పూర్తి వివరాలు మీకోసం..

నవంబర్ 19 న పీఎం కిసాన్ 21 వ విడత డబ్బులు రిలీజ్ అయ్యాయి. ఈ నిధులను ప్రధాని మోడీ తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా దాదాపు రూ. 18,000 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానం ద్వారా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అర్హులైన ప్రతి రైతుకు రూ. 2,000 చొప్పున నిధులు అందుతాయి. దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజనలో భాగంగా ఇప్పటివరకు 20 విడతలుగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ. 3.70 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేశారు.
డబ్బు జమ అవ్వాలంటే ఇలా చేయాలి
పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందడానికి అర్హులైన రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ eKYC పూర్తి చేసి ఉండాలి. ఇప్పటివరకూ ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఇలా చేయండి..
పీఎం కిసాన్ (pm kisan) పోర్టల్ లోకి వెళ్లి అక్కడ ఆధార్ నంబర్‌తో OTP ఆధారంగా eKYC పూర్తి చేయవచ్చు. లేదా మీకు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) లేదా స్టేట్ సేవా కేంద్రాలకు (SSK) వెళ్లి బయోమెట్రిక్ ద్వారా eKYC పూర్తి చేయొచ్చు. అలాగే పీఎం కిసాన్ మొబైల్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా e-KYC చేయవచ్చు. అయితే దీనికంటే ముందుగా మీ భూమి వివరాలు పోర్టల్‌లో నమోదు చేసి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. అలాగే చివరిగా eKYC పూర్తి అయి ఉండాలి.
మీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- మీకు 21వ విడత డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి మీరు PM- Kisan వెబ్‌సైట్ (pmkisan.gov.in) ను విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో ఉన్న "Farmer's Corner" లోకి వెళ్లి "Know Your Status" అనే ట్యాబ్ లోకి వెళ్లాలి.
- అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ని ఎంటర్ చేస్తే.. మీ స్టేటస్ కనపిస్తుంది.
లబ్ధిదారుల లిస్ట్ ఎలా చూడాలి?
మీ గ్రామంలోని లబ్ధిదారుల జాబితాను ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయవచ్చు
- ముందుగా PM కిసాన్ పోర్టల్ (pmkisan.gov.in) లో కి వెళ్లండి.
- అక్కడ 'Farmers Corner' లో 'Beneficiary List' పై క్లిక్ చేయండి.
- మీ రాష్ట్రం, జిల్లా, గ్రామం వంటి వివరాలను ఎంటర్ చేయండి.
- తర్వాత 'Get Report' పై క్లిక్ చేస్తే మీ గ్రామంలోని అర్హులైన రైతుల జాబితా కనిపిస్తుంది.
డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
మీరు స్టేటస్ చెక్ చేసినప్పుడు అక్కడ 'పెండింగ్' అని ఉంటే లేదా నిధులు జమ కాకపోతే మీ అప్లికేషన్ అసంపూర్తిగా ఉందని అర్థం. అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే eKYC కూడా పూర్తి చేయండి. ఇవేమీ పని చేయకపోతే పీఎం కిసాన్ హెల్ప్ లైన్(155261 లేదా 011-24300606) నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications