PM Kisan 20th Installment date Latest Update: దేశంలోని రైతులకు మోదీ సర్కారు శుభవార్తను వినిపించే సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20 వ విడత చెల్లింపుపై అప్ డేట్ వచ్చేసింది.కాగా 19వ విడత నిధులు గతేడాది ఫిబ్రవరిలొ విడుదల కాగా ఈ సారి చాలా ఆలస్యమైంది. ఈ ఏడాది 20వ విడత డబ్బులు జూన్ నెలలో విడుదల అవుతాయని అంతా భావించారు. కాని విడుదల కాలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదు..
అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. జూలై మొదటి లేదా రెండవ వారంలో పిఎం కిసాన్ యొక్క 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలుస్తోంది. కాగా ప్రతి సంవత్సరం మోదీ సర్కారు.. రైతులకు ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లలో మూడు విడతలుగా రూ. 6,000 సాయం పెట్టుబడి కింద అందిస్తోంది. ఈసారి 19వ విడత ఫిబ్రవరిలో విడుదల చేసినా 20వ విడత తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు కొన్ని నివేదికల ప్రకారం, జూలైలో ఒక కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ ఈ విడతను విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

18వ విడత రైతులకు గత సంవత్సరం అక్టోబర్ నెలలో నిధులు విడుదల కాగా.. 19వ విడత ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇవ్వబడింది. అప్పటి నుండి 4 నెలలకు పైగా గడిచాయి. PM కిసాన్ కింద, అర్హత కలిగిన రైతులు ప్రతి 4 నెలల గ్యాప్‌లో రూ. 2,000 చొప్పున పొందుతారు.
ఈ నేపథ్యంలో రైతులు అలర్ట్ అయి తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. SMS రూపంలో నిధులు, OTP ధృవీకరణ, మీ ప్రస్తుత స్థితితో పాటు ఫిర్యాదుల పరిష్కారం వంటి సౌకర్యాలు PM కిసాన్ యోజనలో నమోదు చేయబడిన మొబైల్ నంబర్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రైతులు మీ నంబర్ అందుబాటులో లేకుంటే వెంటనే అప్ డేట్ చేసుకోండి.
మీ మొబైల్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి: ముందుగా రైతులు https://pmkisan.gov.in వైబ్ సైటుకి వెళ్లాలి. అక్కడ కనిపించే 'మొబైల్ నంబర్ అప్ డేట్' పై క్లిక్ చేయాలి. ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి. కొత్త నంబర్‌ను నమోదు చేసి, OTPతో ధృవీకరించాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్ విజయవంతంగా అప్ డేట్ అవుతుంది.
ఈ పద్దతిని ఆప్ లైన్ ద్వారా కూడా రైతులు చేయవచ్చు. మీరు సమీపంలోని CSC కేంద్రానికి లేదా వ్యవసాయ శాఖకు వెళ్లి ఆధార్, రిజిస్ట్రేషన్ నంబర్, కొత్త మొబైల్ నంబర్‌ను అందించడం ద్వారా మీరు అప్ డేట్ చేసుకోవచ్చు. ప్రతి లబ్ధిదారునికి E-KYC తప్పనిసరి. లేకుంటే మీ పేరును లబ్ధిదారుల జాబితా నుండి తొలగించే అవకాశం ఉంది. మొబైల్ నంబర్, ఇంటి చిరునామా, బ్యాంక్ ఖాతా నంబర్‌లో ఎటువంటి తప్పులు ఉండకూడదు. ఇక బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి. ఒకే రైతు రెండుసార్లు నమోదు చేసుకుంటే ప్రయోజనాలు నిలిపివేస్తారు.
ఇక మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకోవాలంటే..ముందుగా మీరు https://pmkisan.gov.in వైబ్ సైటులోకి వెళ్లండి. అక్కడ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. తరువాత రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయండి.అనంతరం e-KYC పూర్తయిందో లేదో, లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో మీరు అక్కడ తనిఖీ చేయవచ్చు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications