మన జీవితంలో ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. అనుకోని ఘటనలు కుటుంబాన్ని ఆర్థికంగా కుదిపేస్తాయి. అలాంటి సమయంలో కుటుంబానికి ఒక భద్రత ఇవ్వాలంటే జీవిత బీమా చాలా అవసరం. అందరికీ అందుబాటులో ఉండేలా, సాధారణ ప్రజల కోసమే ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఈది ఒక జీవిత బీమా పథకం. అంటే, వ్యక్తి చనిపోయిన తర్వాత అతడి కుటుంబానికి రూ 2 లక్షలు ఇవ్వబడతాయి. ఈ బీమాకు వార్షిక ప్రీమియం కేవలం రూ 436 మాత్రమే.
ఎవరు ఈ పథకానికి అర్హులు?
1. ఈ పథకానికి అర్హత పొందేందుకు అభ్యర్థి వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
2. అలాగే, బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే ప్రీమియం ప్రతి సంవత్సరం ఆ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది.
3. పథకానికి జాయిన్ కావాలంటే, అభ్యర్థి తన ఆధార్ కార్డు మరియు నామినీ వివరాలతో బ్యాంకులో ఒక సింగిల్ ఫారమ్ నింపాలి. మొత్తం ప్రక్రియ సులభంగా, త్వరగా పూర్తయ్యేలా రూపొందించబడింది.
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 23.63 కోట్ల మంది లాభం పొందారు. ఈ పథకం ద్వారా రూ. 18,397.92 కోట్ల బీమా మొత్తాన్ని బాధితుల కుటుంబాలకు పంపిణీ చేశారు. విశేషంగా, ఈ పథకం ద్వారా లాభం పొందినవారిలో 10 కోట్లకుపైగా మహిళలు ఉండటం గమనించ దగ్గ విషయం. ఇది మహిళా సాధికారత మరియు ఆర్థిక భద్రత దిశగా జరిగిన గొప్ప అడుగు అని చెప్పవచ్చు.
ఉమా, ఓ గిరిజన మహిళ. భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబం అనిశ్చితిలో పడిపోయింది. కానీ పంచాయితీ కార్యదర్శి ద్వారా ఆమెకు PMJJBY పథకం గురించి తెలిసి, భర్త తీసుకున్న బీమా వల్ల రూ 2 లక్షలు ఆమెకు వచ్చాయి. ఆ డబ్బుతో ఆమె పిల్లల చదువు కొనసాగించగలిగింది.
ఇంకొక ఉదాహరణ రాజేష్ అనే గాజుల వ్యాపారి, కేవలం రూ 436 చెల్లించి ఈ బీమా తీసుకున్నాడు. ఏడాదికే తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. అతడి భార్యకు వెంటనే రూ 2 లక్షల బీమా సాయం వచ్చింది. ఈ సాయం లేకపోతే ఆ కుటుంబం భవిష్యత్తు ప్రశ్నార్థకమై ఉండేది.
మన దేశంలో చాలా మంది ఎలాంటి బీమా లేకుండానే జీవిస్తున్నారు. కానీ ఒక్కసారి అయినా తీసుకునే చిన్న బీమా కూడా, అవసరమైన సమయంలో చాలా పెద్ద సహాయంగా మారుతుంది. కేవలం చిన్న మొత్తంలోనే ప్రీమియం చెల్లించి, సామాన్యులు కూడా తమ కుటుంబానికి భద్రత కల్పించుకోవచ్చు.
ప్రస్తుతం ఈ పథకం ద్వారా అందించే రూ 2 లక్షల బీమా కవరేజిని రూ 4 లక్షలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే బీమా మొత్తాన్ని పెంచితే, ప్రీమియం కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రూ 436 ప్రీమియం, ఆ సమయంలో రూ 700 నుంచి రూ 800 వరకూ ఉండొచ్చని అంచనా. కానీ పెరిగిన ప్రీమియంతో పాటు, కుటుంబానికి అందే ఆర్థిక భద్రత కూడా మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
పేదవాడికి బీమా అవసరం ఉండదు అనే అపోహలు మారాలి. జీవితాన్ని ముందుగానే ఊహించలేం కానీ భద్రతను ముందుగానే కల్పించవచ్చు. రూ 436తో భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టొచ్చు. ఒక్కసారి ఈ పథకాన్ని తీసుకుంటే, మీరు పోయిన తర్వాతా మీ కుటుంబానికి గుర్తుండేలా చేయొచ్చు.


Click it and Unblock the Notifications