ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువును పెంచారు. ఇది అర్హులైన ప్రతి ఒక్కరికీ తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి లభించిన చివరి అవకాశం. ఈ పథకం వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దరఖాస్తు గడువు పెంపు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PM Awas Yojana Gramin AP) కింద దరఖాస్తు చేసుకునేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం గడువును డిసెంబర్ 14, 2025 వరకు పొడిగించింది. అంతకుముందు కూడా రెండు సార్లు గడువు పొడిగించినందున.. ఇది అప్లై చేసుకోవడానికి ఉన్న లాస్ట్ ఛాన్స్ అని భావించాలి. ఇప్పటికే దరఖాస్తు చేసుకోలేని వారు, వెంటనే అప్లై చేసుకోవడం తప్పనిసరి.
ప్రాసెస్ ఇలా..
ఇల్లు లేని పేదలు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ కింది విధానాన్ని పాటించండి..
- సచివాలయానికి వెళ్లండి: మీకు దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లండి. అక్కడ ఉండే ఇంజినీరింగ్ అసిస్టెంట్ లేదా సంబంధిత సిబ్బందిని కలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) దరఖాస్తు ఫారమ్ గురించి అడగండి.
- సర్వే బృందాల ద్వారా: ప్రస్తుతం అధికారులు ప్రతి గ్రామంలోనూ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మీ ప్రాంతంలో సర్వే బృందాలు పర్యటిస్తున్నట్లయితే, వారిని సంప్రదించి, దరఖాస్తు ఫారమ్ నింపి వారికి సమర్పించవచ్చు.
- క్లారిటీ ముఖ్యం: దరఖాస్తు చేసేటప్పుడు మీ వివరాలు, స్థలం వివరాలు (సొంత స్థలం ఉన్నట్లయితే) సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి.
- క్షేత్రస్థాయి నమోదు: దరఖాస్తులను స్వీకరించిన సచివాలయ సిబ్బంది, మీ ఇంటి వద్దకు లేదా స్థలం వద్దకు వచ్చి, ఆవాస్ ప్లస్(Awaas Plus) యాప్‌లో మీ ఫొటో, వేలిముద్రలు తీసుకుని వివరాలను నమోదు చేస్తారు.
రూ. 2.5 లక్షలు లబ్ధి
ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్థిక సహాయం అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రూ. 1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా రూ. 1.00 లక్ష కలిపి మొత్తం రూ. 2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. దీంతో పాటు, ఇళ్లు నిర్మాణంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం కింద పని కల్పించడం ద్వారా ఉపాధి లబ్ధి కూడా కలుగుతుంది. గతంలో మంజూరయ్యి, అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను కూడా పూర్తి చేయడానికి అదనపు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఇదో అద్భుత అవకాశం. గడువు ముగియకముందే, డిసెంబర్ 14లోపు మీ దరఖాస్తును పూర్తి చేసి సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications