IPO News: ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన రెండవ ఐపీవో ఇన్వెస్టర్లను సంతోషంలోకి నెట్టింది. ఒక ఐపీవో నిరాశకు గురిచేసినప్పటికీ.. ఇంకోటి మాత్రం లాభాల కోలాహలాన్ని కొనసాగిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్లాజా వైర్స్ లిమిటెడ్ ఐపీవో గురించే. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కంపెనీ షేర్లు అద్భుతమైన లిస్టింగ్ నమోదు చేశాయి. తొలిరోజు 55.56 శాతం ప్రీమియం ధరకు షేర్లు బీఎస్ఈలో రూ.84 వద్ద లిస్టింగ్ చేయబడ్డాయి. ఇదే సమయంలో స్టాక్ ఎన్ఎస్ఈలో 40.74 శాతం మేర ప్రీమియంతో రూ.76 ధర వద్ద లిస్టింగ్ జరిగింది. దీంతో ఐపీవోలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు తొలిరోజే భారీ లాభాలు గడించారు.

అక్టోబర్ 12 నుంచి అమలులోకి వచ్చిన బీఎస్ఈ సర్క్యులర్ ప్రకారం.. ప్లాజా వైర్స్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లు 'T' గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీల్లో జాబితా చేయబడింది. దీనికింద ప్లాజా వైర్స్ స్టాక్ 10 ట్రేడింగ్ రోజుల పాటు ట్రేడ్ ఫర్ ట్రేడ్ విభాగంలో ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో సెప్టెంబర్ 29న తెరవబడి అక్టోబర్ 5న ముగిసింది. దీనికోసం ఒక్కో షేర్ ధరను కంపెనీ రూ.51-54గా నిర్ణయించింది. ఐపీవో కోసం ఇన్వెస్టర్లు కనీసం రూ.14,958 పెట్టుబడితో 277 షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఐపీవో నుంచి కంపెనీ రూ.71.28 కోట్లను మార్కెట్ల నుంచి సేకరించింది. 2006లో స్థాపించబడిన కంపెనీ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గూడ్ వ్యాపారంలో ఉంది. ఈ క్రమంలో కంపెనీ ఎల్ టి అల్యూమినియం వైర్ల తయారీ, విక్రయం చేస్తోంది. మెుదటగా ప్లాజా వైర్స్ నవరత్న వైర్స్ పేరుతో ప్రారంభమైంది.
More From GoodReturns

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications