భారతీయ ఇన్వెస్టర్లకు సాధారణంగా బంగారం, వెండి అంటేనే అమితమైన ఇష్టం. సురక్షితమైన పెట్టుబడి అంటే అందరూ బంగారం (gold) లేదా వెండి (silver) వైపే చూస్తారు. ఎందుకంటే ఈ ఏడాది గోల్డ్ దాదాపు 78 శాతం రిటర్న్స్ ఇచ్చి రూ. 1.40 లక్షల మార్కును దాటింది. వెండి ఏకంగా 144 శాతం లాభాలను పంచి రూ. 2 లక్షల ధరను చూసింది. అయితే ఈ రెండింటి కంటే ఎక్కువగా మరో రెండు మెటల్స్ అంచనాలకు మించి రాణించాయి. అవే ప్లాటినం (Platinum) , కాపర్ (Copper).

ప్లాటినం: మార్కెట్ కొత్త రారాజు!
సాధారణంగా ప్లాటినం రేట్లు బంగారం కంటే తక్కువగా పెరుగుతుంటాయి. కానీ, 2025లో సీన్ రివర్స్ అయింది. ఏడాది ఆరంభంలో 1,000 డాలర్ల కంటే తక్కువగా ఉన్న ప్లాటినం ధర.. అనూహ్యంగా 2,300 డాలర్లకు చేరింది. అంటే ఇన్వెస్టర్లకు దాదాపు 140 శాతం లాభం చేకూరింది.
- పెరుగుదలకు కారణం: ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాటినం ఉత్పత్తిదారు అయిన దక్షిణాఫ్రికాలో ఉత్పత్తి సంక్షోభం ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం. సరఫరా తగ్గిపోవడంతో డిమాండ్ విపరీతంగా పెరిగి ధరలు ఆకాశాన్ని తాకాయి.
- చైనా డిమాండ్: చైనాలో ఇండస్ట్రియల్ అవసరాల కోసం ప్లాటినం వాడకం పెరగడం, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీలో దీని వినియోగం ధరలకు రెక్కలు తొడిగింది.
కాపర్.. ఇక 'న్యూ గోల్డ్'!
కేవలం ఖరీదైన లోహాలే కాదు, నిత్యం వాడే కాపర్ (రాగి) కూడా ఈ ఏడాది కోలుకోలేని స్థాయిలో పెరిగింది. దీనిని ఇప్పుడు మార్కెట్ నిపుణులు 'న్యూ గోల్డ్' అని పిలుస్తున్నారు. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో కాపర్ ధర టన్నుకు 12,000 డాలర్ల రికార్డు స్థాయిని దాటింది. 2009 తర్వాత రాగికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఏడాది ప్రాతిపదికన ఇది 35 శాతానికి పైగా లాభాలను ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లు.. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. ఇండోనేషియా, చిలీ గనుల్లో ప్రమాదాల వల్ల ఉత్పత్తి ఆగడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
గోల్డ్‌మ్యాన్ శాక్స్ నివేదిక ప్రకారం.. 2026 నాటికి సప్లై పెరిగే అవకాశం ఉండటంతో కాపర్ ధరలు టన్నుకు 10,000 - 11,000 డాలర్ల వద్ద స్థిరపడవచ్చు. అయితే ప్లాటినం మాత్రం తన దూకుడును కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. కేవలం బంగారమే కాకుండా, ప్లాటినం, కాపర్ వంటి కమోడిటీలపై కూడా దృష్టి పెడితే భారీ లాభాలు పొందవచ్చని ఈ ఏడాది నిరూపించింది.
అయితే పెట్టుబడిదారులు కొత్త లోహాల విషయంలో జాగ్రత్త పడుతూనే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం మంచిది. పెట్టుబడుల విషయంలో ఎప్పుడూ ఒకే లోహంపై ఆధారపడటం కంటే ఇలాంటి ఇండస్ట్రియల్, ప్రీషియస్ మెటల్స్‌పై అవగాహన పెంచుకోవడం ఉత్తమం. 2025లో ఈ రెండు లోహాలు ఇన్వెస్టర్ల జేబులను నింపేశాయని చెప్పడంలో సందేహం లేదు!
More From GoodReturns

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications