TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులు గుడ్ న్యూస్.. సిటీ బస్సుల్లో మెట్రో తరహా టికెట్ బుకింగ్ విధానం..!
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణించాలంటే.. ముందుగా టికెట్ బుక్ చేసుకుంటాం. ఫోన్ లో టికెట్ బుక్ చేసుకోలేనివారు మెట్రో స్టేషన్ కు వెళ్లి టికెట్ తీసుకుంటారు. స్మార్ట్ ఫోన్ టికెట్ బుక్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేసి లోపలికి వెళ్లి మెట్రో ఎక్కుతారు. ఒక వేళ టికెట్ కొనుగోలు చేస్తే టికెట్ పై కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి లోపలికి వెళ్లి మెట్రో రైలు ఎక్కుతారు. అయితే ఇప్పుడు ఆర్టీసీలో కూడా ఇలాంటి విధానం తీసుకురావాలని చూస్తున్నారు.
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఈ విధానం తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3200కు పైగా బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో రోజుకు దాదాపు 26 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇందులో సుమారు 70 మంది మహిళలే ఉన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళా ప్రయాణికులు భారీగా ప్రయాణం చేస్తున్నారు. మిగతా ప్రయాణికుల ద్వారా ఆర్టీసీకి రోజుకు దాదాపు 6.5 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో దాదాపు 24 శాతం యూపీఐ చెల్లింపుల ద్వారానే వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఫోన్ టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాలని భావిస్తున్నారు. అడ్వాన్స్ టికెటింగ్ విధానం అమల్లోకి వస్తే యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సిటీ బస్సులో ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికులు టికెట్ తీసుకోవడం కష్టంగా మారింది. అటు కండక్టర్ కూడా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్య మహిళా కండక్టర్లు రద్దీ సమయాల్లో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో యూపీఐ పేమెంట్ లేట్ అవుతుంది. అందుకే అడ్వాన్స్ టికెటింగ్ విధానం తీసుకురావాలని భావిస్తున్నారు.
ఈ విధానం అమల్లోకి తీసుకొస్తే ప్రయాణికుల సమయం ఆదా కావడంతో పాటు కండక్టర్లకు ఇబ్బందులు తప్పుతాయని యోచిస్తున్నారు. ఆర్టీసీ ఇప్పటికే డిజిటల్ బస్ బస్సులు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 14 వేల మందికి పైగా ప్రయాణికులు డిజిటల్ బస్‌పాస్‌లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అడ్వాన్స్ టికెటింగ్ విధానంలో ఇబ్బందులు ఉంటాయని కొందరు చెబుతున్నారు. మెట్రోలో అయితే స్కాన్ చేసి మెట్రో రైలు ఎక్కుతారు. మరి బస్సులో ఎక్కడ స్కాన్ చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఈ విధానం అమలు చేయడం చాలా కష్టమని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications