Bengaluru: బెంగళూరు వాసులకు శుభవార్త.. 10 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిర్ణయం..!
బెంగళూరు వాసులకు త్వరలో కొంత మేర ట్రాఫిక్ కష్టాలు తప్పే అవకాశం ఉంది. స్వామి వివేకానంద మెట్రో స్టేషన్‌ను సిల్క్ బోర్డ్ జంక్షన్‌కు కలిపే ప్రతిపాదిత 11 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ.1300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ బెంగళూరులో అత్యంత రద్దీ ప్రాంతాలైన ఇందిరానగర్, డొమ్లూర్, కోరమంగళ, మడివాళ గుండా వెళ్తోంది. ఎలివేటెడ్ కారిడార్ కోసం
బెంగళూరు స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (బి-స్మైల్) ఇటీవల బిడ్లను ఆహ్వానించింది.
ఈ ఎలివేటెడ్ కారిడార్ వెంబడి ఉన్న ఆస్తులు సంబంధించి పన్నుల తో ప్రాజెక్టు కు కొంత మొత్తాన్ని సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ 10 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడర్ ను టోలింగ్‌తో కూడిన బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT) పద్ధతిలో నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. టోలింగ్ సాధ్యం కాకపోయినా, ఆచరణీయమైన బిడ్ రాకపోయినా, వాల్యూ-క్యాప్చర్ ఫైనాన్సింగ్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయాలి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ కారిడార్ వల్ల పరిసర ప్రాంతాల్లో ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ మేరకు ఆస్తి పన్ను వసూలు చేయాలని చూస్తున్నారు.

అయితే నిధుల సమీకరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బి-స్మైల్ మేనేజింగ్ డైరెక్టర్, జిబిఎ చీఫ్ కమిషనర్ మహేశ్వర్ రావు చెప్పారు. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల పెరిగిన భూమి, ఆస్తుల విలువలను నగదుగా మార్చుకునేందుకు ప్రణాళికల కోసం చూస్తున్నట్లు చెప్పారు. కాగా
ఈ ఫ్లైఓవర్ ప్రతిపాదనకు ఇందిరానగర్‌లోని కొన్ని సంఘాల నుంచి ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. ప్రతిపాదిత 24 నెలల కాలపరిమితి ఎందుకని ప్రశ్నించింది. డీపీఆర్ ప్రకారం ఈ కారిడార్‌పై రద్దీ వేళల్లో గంటకు సుమారు 3,996 ప్యాసింజర్ కార్ యూనిట్లు (PCU) ట్రాఫిక్ ఉంటుందని అంచనా వేయగా, రాబోయే 25 ఏళ్లలో ఇది గంటకు 12,000 PCUలను మించిపోతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న 20 మీటర్ల వెడల్పు గల రహదారి ఉన్నప్పటికీ ట్రాఫిక్ కొనసాగుతోంది. అందుకే ఈ దారిలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు. మెట్రో స్టేషన్ల సమీపంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్లు నిర్మిస్తే ఎలా ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అక్కడ ప్రతిపాదిత పిల్లర్ ప్రదేశాలు ఫీడర్ బస్సులు, అత్యవసర ప్రవేశం, ప్రయాణీకుల రాకపోకల కోసం ఉపయోగించే సర్వీస్ రోడ్లను ప్రభావితం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి సమయం పట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications