కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ప్రకటించిన GST 2.0 సంస్కరణలను భారత్ ఆర్థిక వ్యవస్థకి పెద్ద మార్పు చేసే "గేమ్-చేంజింగ్ స్టెప్" అని పేర్కొన్నారు. ఆయన చెప్పినట్లే, ఈ కొత్త మార్పులు మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కలిగిస్థాయి, ఎగుమతులను ప్రోత్సహిస్తాయి, మరియు దేశ వృద్ధిని వేగవంతం చేస్తాయి.

గోయల్ టైమ్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ "GST 2.0 నిజంగా పెద్ద ఆర్థిక మార్పు. పన్నులు సులభం అవుతాయి, ద్రవ్యోల్బణం తగ్గుతుంది, మధ్యతరగతికి కూడా ఉపశమనం లభిస్తుంది." గత కొన్ని సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం చాలా తగ్గిపోయింది, 2014 నుంచి కొత్త పాలన కారణంగా ప్రజల జీవన స్థాయి కూడా గణనీయంగా మెరుగైందని ఆయన చెప్పారు.
గోయల్ భారతదేశం యొక్క ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వులు మరియు FDI ప్రవాహాలు రికార్డ్ స్థాయిలలో ఉన్నాయని తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా భారత్ ఆర్థిక వ్యవస్థ పై ఉన్న నమ్మకాన్ని చెబుతోంది. "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను శక్తి వంతం చేయాలనుకుంటున్నారు. మన IT రంగం ప్రపంచస్థాయిలో టాలెంట్ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందింది" అని ఆయన చెప్పారు.
ఎగుమతులు, వ్యాపార చర్చలు: గ్లోబల్ ఇబ్బందులు ఉన్నప్పటికీ, భారత్ ఎగుమతులు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటాయని గోయల్ చెప్పారు. భారత్ అనేక దేశాలతో వ్యాపార చర్చల్లో నిమగ్నమై ఉంది, న్యాయమైన, సమానమైన భాగస్వామ్యాలను కొనసాగిస్తున్నామని అన్నారు. టెక్స్టైల్, చిప్ లు వంటి అత్యంత ప్రభావిత రంగాలకు ప్రత్యేక మద్దతు చర్యలు కూడా ప్రణాళికలో ఉన్నాయి.
గోయల్ మాటల్లో, "భారతదేశం ఎల్లప్పుడూ సవాళ్లను అవకాశాలుగా మార్చింది. 2027 నాటికి భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద GDP అవుతుంది. భారత్ అన్ని దేశాలకు మంచి స్నేహితులు, గ్లోబల్ వృద్ధిలో విశ్వసనీయ భాగస్వామి."
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం కొన్ని రకాల ప్రభావాలను చూపిస్తున్నాయి. ఉదాహరణకి, అమెరికాలో సుంకాలు పెరగడం, గ్లోబల్ మాంద్యం ప్రమాదాలు వంటి అంశాలు భారత ఎగుమతులపై ప్రభావం చూపొచ్చు. అంతే కాక, చైనా, యూరోప్ వంటి దేశాలతో ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇవి భారత వ్యాపారానికి కొత్త అవకాశాలను తెచ్చేలా ఉంటాయి. అంటే, సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశంకి గ్లోబల్ మార్కెట్‌లో మంచి వ్యాపార అవకాశాలు కూడా ఉన్నాయి.
భారత IT & టెక్ రంగం ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో చాలా గుర్తింపు పొందింది. IT ఎగుమతులు ప్రతి ఏడాదీ రికార్డ్ స్థాయిలకు చేరుతున్నాయి. ఇప్పటికే కొత్త సాంకేతిక రంగాలు, AI, బ్లాక్‌చైన్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఫీల్డ్స్ లో భారత టాలెంట్ ప్రాధాన్యత పొందింది. ఈ రంగాల్లో టాప్ టాలెంట్లు మాత్రమే కాకుండా, ఇండియాలోని స్టార్టప్‌లు కూడా వినూత్న పరిష్కారాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు.
ఈ మార్పులు, సులభమైన పన్ను నిర్మాణం, ద్రవ్యోల్బణం నియంత్రణ, మధ్యతరగతికి ఉపశమనం, ఎగుమతుల పెరుగుదల అన్నీ కలిసి 2027కి భారత్ ఆర్థికంగా మరింత బలమైయిది అని కేంద్ర నేతలు విశ్వసిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications