బెంగళూరుకు షాక్.. రంగంలోకి దిగిన నారా లోకేష్! ఆ ఒక్క ట్వీట్‌తో మారిపోయిన గేమ్!
సౌత్ ఇండియాలో ఇప్పుడు రాష్ట్రాల మధ్య ఇన్వెస్ట్‌మెంట్ల వార్ పీక్స్‌కు చేరింది. దేశంలోనే పేరుగాంచిన స్పేస్‌టెక్ స్టార్టప్ 'పిక్సెల్' (Pixxel) తన కొత్త శాటిలైట్ తయారీ ఫ్యాక్టరీ కోసం స్థలం వెతుకుతోంది. అయితే, స్టార్టప్‌ల రాజధాని అయిన బెంగళూరు శివార్లలో ల్యాండ్ దొరకడం ఎంత కష్టంగా మారిందో ఆ కంపెనీ కో-ఫౌండర్ క్షితిజ్ ఖండేల్వాల్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (ట్విట్టర్) లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
"నిజానికి శాటిలైట్లు తయారు చేయడం కంటే, బెంగళూరు అవుట్‌స్కర్ట్స్‌లో ఫ్యాక్టరీ కోసం ల్యాండ్ సంపాదించడం చాలా కష్టంగా ఉంది" అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సౌత్ స్టేట్స్‌లో పెను సంచలనం సృష్టించింది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు వెంటనే రంగంలోకి దిగాయి.

రంగంలోకి దిగిన నారా లోకేష్.. అనంతపూర్ పిలుపు!
క్షితిజ్ పోస్ట్‌కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. బెంగళూరుకు అతి సమీపంలో ఉన్న అనంతపూర్‌ను బెస్ట్ ఆప్షన్‌గా ఆయన ప్రెజెంట్ చేశారు. "క్షితిజ్.. బెంగళూరు శివార్లలోనే సరికొత్త ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ డెస్టినేషన్ ఉంది, అదే అనంతపూర్. మేము అక్కడ 'స్పేస్ సిటీస్', ఏరోస్పేస్ పార్కులు, రెడీ-టు-గో ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్స్‌ను బిల్డ్ చేస్తున్నాం. కాబట్టి ఫౌండర్లు స్థలం కోసం టైమ్ వేస్ట్ చేయకుండా శాటిలైట్లు నిర్మించడంపై ఫోకస్ పెట్టవచ్చు" అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడంపై క్షితిజ్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, అనంతపూర్ స్పేస్ సిటీ ప్రపోజల్‌ను పరిశీలించడానికి తాము ఎగ్జైటింగ్‌గా ఉన్నామని రిప్లై ఇచ్చారు.
పోటీలోకి వచ్చిన తమిళనాడు.. హోసూర్ ఆఫర్!
ఆంధ్రప్రదేశ్ ఆఫర్ ఇచ్చిన మరుసటి రోజే తమిళనాడుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఆర్మ్ 'గైడెన్స్ తమిళనాడు' కూడా రేస్‌లోకి వచ్చింది. బెంగళూరు (Bengaluru) కు బోర్డర్‌లో ఉన్న హోసూర్‌ను తమ హబ్‌గా ఎంచుకోవాలని పిక్సెల్ కంపెనీని ఆహ్వానించింది. హోసూర్‌లో ఉన్న బలమైన మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, స్ట్రాటజిక్ లొకేషన్ కంపెనీ తదుపరి విస్తరణకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని తమిళనాడు పిచ్ చేసింది.
కర్ణాటక కూడా వెనక్కి తగ్గట్లేదు!
ఈ ట్విట్టర్ వార్ చూసిన కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ కూడా అలర్ట్ అయ్యారు. తమ ఆఫీస్ వెంటనే పిక్సెల్ కంపెనీతో టచ్‌లోకి వస్తుందని, ల్యాండ్ ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
బెంగళూరు (Bengaluru) లో టాలెంట్, ఇస్రో (ISRO) ఎకోసిస్టమ్, సప్లయ్ బేస్ లాంటి ప్లస్ పాయింట్లు ఉన్నప్పటికీ.. అక్కడ ఉన్న ల్యాండ్ క్రంచ్ (స్థలాల కొరత) వల్ల పొరుగు రాష్ట్రాలు స్మార్ట్‌గా కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. మరి ఈ క్రేజీ స్పేస్‌టెక్ ఫ్యాక్టరీ చివరికి ఎక్కడికి వెళ్తుందో చూడాలి!


Click it and Unblock the Notifications