Multibagger Stock: ప్రస్తుతం మార్కెట్లో అనేక పెన్నీ స్టాక్స్ ఉన్నాయి. అయితే వీటిలో చాలా మల్టీబ్యాగర్స్ దాగి ఉంటాయి. బంగారం లాంటి వ్యాపార భవిష్యత్తు, మంచి ఫండమెంటల్స్, సరైన యాజమాన్యం ఉంటే వాటిని ఇన్వెస్టర్లు ఎంచుకోవచ్చు. వీటిలో రిస్క్ కు తగ్గట్టుగానే రిటర్న్స్ ఉంటాయి.
దీర్ఘకాలం నమ్మకంగా పెట్టుబడులను కొనసాగించిన వారికి మంచి రాబడులను అందించిన అనేక మల్టీబ్యాగర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మద్యం వ్యాపారంలో ఉన్న పికాడిలీ ఆగ్రో ఇండ్స్ లిమిటెడ్ స్టాక్ గురించి. 1997లో కంపెనీ షేర్ ధర కేవలం 25 పైసలుగా ఉంది. అప్పటి నుంచి స్టాక్ దాదాపు 112,700 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. కంపెనీకి చెందిన విస్కీ ఇంద్రి.. దీపావళి కలెక్టర్ ఎడిషన్ 2023 కూడా 2023 విస్కీ ఆఫ్ వరల్డ్‌లో 'బెస్ట్ ఇన్ షో, డబుల్ గోల్డ్' టైటిల్‌ను గెలుచుకుంది. ఈ భారతీయ బ్రాండ్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది.

1997 జూలై 11న కంపెనీ షేర్ ధర స్టాక్ ధర 25 పైసలుగా ఉన్నప్పుడు కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన వారు ప్రస్తుతం కోటీశ్వరులుగా మారిపోయేవారు. అవును ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం లక్ష పెట్టుబడి విలువ ఏకంగా రూ.65 కోట్లకు చేరుకుంది. ఈ నెల ప్రారంభంలో స్టాక్ భారీగా లాభపడింది. ప్రస్తుతం షేర్ ధర రూ.254.55 వద్ద కొనసాగుతోంది. ఐదేళ్ల కాలంలో కంపెనీ స్టాక్ పనితీరును గమనిస్తే.. 2244 శాతం రాబడిని అందించింది. అక్టోబర్ 26, 2018లో కంపెనీ ఒక్కో షేర్ ధర కేవలం రూ.12.03గా ఉంది. అలాగే ఆరు నెలల పనితీరును పరిశీలిస్తే.. ఇన్వెస్టర్లు 439.20% రాబడిని పొందారు. ఈ స్టాక్ గత నెలలోనే 173.65% రాబడిని అందించింది. చివరిగా స్టాక్ సోమవారం 5 శాతం మేర నష్టాల్లో ట్రేడింగ్ ముగించింది.
పికాడిలీ ఆగ్రో లిమిటెడ్ కంపెనీకి చెందిన ఇంద్రి విస్కీకి భారతదేశంలోనే
కాకుండా విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ కలిగి ఉంది. ప్రస్తుతం ఇది దేశంలోని 19 రాష్ట్రాల్లో సరఫరా చేయబడుతూ విక్రయించబడుతోంది. అయితే ఈ బ్రాండ్ ప్రపంచంలోని 17 దేశాల్లో అందుబాటులో ఉంది. ఈ విస్కీ ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని విడుదల చేసి రెండేళ్లు మాత్రమే అయ్యింది. 2021లో హర్యాణాలోని ఈ విస్కీ బ్రాండ్ మెుదటిసారిగా ప్రారంభించబడింది. దీని తయారీ ప్లాంట్ హర్యాణాలో మాత్రమే జరుగుతోందని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications