Multibagger Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న ర్యాలీ పెన్నీ మల్టీబ్యాగర్ షేర్లకు భారీగా కలిసొస్తోంది. ఈ క్రమంలోనే ఒక లిక్కర్ కంపెనీ షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది పికాడిల్లీ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. హర్యానాకు చెందిన ఈ లిక్కర్ కంపెనీ షేర్ల కోసం ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. కొద్ది రోజుల విరామం తర్వాత రెండు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ అప్పర్ సర్క్యూట్ తాకటంతో మళ్లీ మల్టీబ్యాగర్ వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో స్టాక్ ధర నేడు 5 శాతం అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యి రూ.253.35 వద్ద బీఎస్ఈలో కొనసాగుతోంది.

ప్రస్తుతం పిక్కడిల్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. పైగా ఈ కంపెనీ నుంచి దీపావళి 2023లో విడుదలైన ఎడిషన్ ఇంద్రి ఉత్తమ విస్కీ అవార్డును అందుకుంది. ఈ పెన్నీ స్టాక్ ధర జూలై 11, 1997న ఒక్కొక్కటి కేవలం 25 పైసలు మాత్రమే. ఆ సమయంలో ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టినట్లయితే దాని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.10 కోట్లకు దగ్గరగా చేరుకుంది. ఈ మల్టీబ్యాగర్ లిక్కర్ స్టాక్ కేవలం ఈ ఏడాది ఇప్పటి వరకు 450 శాతం మేర ఇన్వెస్టర్లకు రాబడిని అందించింది.
పిక్కడిల్లీ తన కొత్త పెట్టుబడిదారులను కూడా నిరాశపరచలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ స్టాక్‌లో డబ్బు పెట్టుబడి పెట్టిన వారు మంచి లాభాలనే సంపాదించారు. వీరు దాదాపు ఐదున్నర రెట్లు రాబడిని పొందారు. అలాగే కనీసం 6 నెలల కిందట కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగిస్తున్న ఇన్వెస్టర్లు సైతం దాదాపు మూడున్నర రెట్లు రాబడిని అందుకున్నారు. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.328గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.38.70గా నిలిచింది.


Click it and Unblock the Notifications