India Post SMS Scam: దేశంలోని కోట్లాది మంది గ్రామీణ, పట్టణ ప్రజలు ఎన్ని బ్యాంకింగ్ సంస్థలు వచ్చినా ఇప్పటికీ వారు నమ్మేది పోస్టల్ స్వీసులనే. వారు తమ గ్రామాల్లోనే వీటిలో డబ్బును పొదుపుచేసుకోవటం నుంచి ఇన్సూరెన్స్ వంటి సేవల వరకు వీటి నుంచి పొందుతున్నారు. అయితే ఈ సారి స్కామర్లు పోస్టల్ వినియోగదారులను టార్గెట్ చేయటంతో చాలా మంది నష్టపోతున్నారు. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
మోసగాళ్లు ఇప్పటికే దేశంలో అనేక కొత్త పద్ధతులను వినియోగించి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల పేర్లను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా వీరు ఇండియా పోస్ట్ పేరును పెద్ద స్థాయిలో మోసాలకు వినియోగించటం వెలుగులోకి వచ్చింది. ఈ కొత్తరకం మోసంలో ముందుగా ఇండియా పోస్ట్ పేరుతో మోసగాళ్లు ప్రజలకు మెసేజ్ పంపిస్తున్నారు. వారు ఆ మెసేజ్‌లో ఒక వెబ్ లింక్ పంపుతారు. మీకు పార్శిల్ డెలివరీ కోసం 48 గంటల్లో చిరునామాను ఇవ్వాలని మోసగాళ్లు సదరు మెసేజ్ ద్వారా అడుగుతున్నారు.

ఇండియా పోస్ట్ పేరుతో ప్రజలకు వస్తున్న ఈ ఫేక్ మెసేజ్ పై ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలను హెచ్చరిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఒక పోస్ట్ షేర్ చేసింది. నేరగాళ్లు పంపిస్తున్న ఫేక్ మెసేజ్‌లోని లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందువల్ల ఇలాంటి మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని వారు కోరుతున్నారు.
చిరునామాను అప్‌డేట్ చేయాలంటూ ఇండియా పోస్ట్ పేరుతో సైబర్ మోసగాళ్లు పంపిన లింక్ పై క్లిక్ చేయటం ద్వారా వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వారు పంపిన లింక్ ద్వారా వ్యక్తుల ఫోన్లలోకి మాల్వేర్ చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ ప్రైవేట్ డేటా చోరీకి గురై ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి దీని గురించి జాగ్రత్తగా ఉండేందుకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తాజాగా రావటం ప్రజలను అప్రమత్తంగా చేస్తోంది. ఇండియా పోస్ట్ ఇలాంటి సందేశాలను కస్టమర్లకు పంపదని పీఐబీ వెల్లడించింది. ఎవరైనా ఇలాంటి మెసేజ్ లను అందుకుంటే అందులోని లింక్స్ పై క్లిక్ చేయవద్దని, ఆ సందేశాలను డిలీట్ చేయాలని PIB కోరింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications